CM KCR's Acrylic Painting By AP Artist : కేసీఆర్‌పై ప్రొద్దుటూరు పెయింటర్ అభిమానం.. 7 రోజులుగా సైకిల్ యాత్ర చేసి మరీ.. - Proddatur Painter Love Towards CM KCR
🎬 Watch Now: Feature Video
Published : Sep 9, 2023, 12:10 PM IST
CM KCR's Acrylic Painting By AP Artist : తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ పట్ల ఆంధ్రప్రదేశ్ ప్రొద్దుటూరుకి చెందిన చిత్రకారుడు తన అభిమానాన్ని చాటుకున్నారు. కేసీఆర్‌పై ఉన్న అభిమానంతో రామాంజనేయ రెడ్డి ఇరవై రోజుల పాటు కష్టపడి కాన్వాస్‌పై ఆక్రిలిక్‌తో పాటు గండికోట మట్టితో మోనో కలర్లో కేసీఆర్ చిత్రపటాన్ని గీశారు. దివ్యాంగుడిగా అనేక కష్టాలనుభవించి స్వయం కృషితో పెయింటింగ్ ఆర్టిస్ట్‌గా ఎదిగిన తుపాకుల రామాంజనేయరెడ్డి.. వాటిని ప్రత్యేకంగా ఫ్రేములు కట్టించి ప్రొద్దుటూరు నుంచి సైకిల్ యాత్ర ద్వారా 7 రోజుల పాటు ప్రయాణం చేసి తన మిత్రులతో కలిసి హైదరాబాద్ చేరుకున్నారు.
Proddatur Painter Love Towards CM KCR : ప్రగతి భవన్‌కు వచ్చిన ఆర్టిస్టు బృందానికి మంత్రి కేటీఆర్ స్వాగతం పలికారు. పట్టువదలకుండా అనుకున్నది సాధిస్తూ, అసాధ్యాన్ని సుసాధ్యం చేస్తూ వస్తున్న సీఎం కేసీఆర్ గారంటే తనకు ఎనలేని అభిమానమని కేటీఆర్‌తో రామాంజనేయరెడ్డి చెప్పారు. తెలంగాణను సాధించడమే కాకుండా అనతి కాలంలోనే అభివృద్ధి పథంలో దేశానికి ఆదర్శంగా తెలంగాణ రాష్ట్రాన్ని ముందుకు తీసుకుపోతున్న సీఎం కేసీఆర్ ఆదర్శవంతమైన నేతగా ఆయన పేర్కొన్నారు. సీఎం కేసీఆర్ పట్ల వారికున్న అభిమానాన్ని తెలుసుకుని సంతోషం వ్యక్తం చేసిన మంత్రి కేటీఆర్.. వారు తెచ్చిన ఫొటోలను సీఎం కేసీఆర్ తరఫున స్వీకరించి అభినందించారు.