హోటల్ గదిలో చిరుత బీభత్సం- 2గంటలు అక్కడే మకాం- చివరకు ఏమైందంటే? - రాజస్థాన్ జైపుర్లో చిరుత కలకలం
🎬 Watch Now: Feature Video
Published : Jan 18, 2024, 10:31 PM IST
Cheetah In Hotel Room In Jaipur : రాజస్థాన్ జైపుర్ కనోతా ప్రాంతంలోని ఓ ప్రైవేట్ హోటల్లో గురువారం ఉదయం ఓ చిరుత బీభత్సం సృష్టించింది. అకస్మాత్తుగా హోటల్ గదిలోకి ప్రవేశించి అక్కడ పనిచేస్తున్న సిబ్బందిని తీవ్ర భయాందోళనకు గురిచేసింది. దీంతో వెంటనే వారు చిరుత ఉన్న గదికి బయట నుంచి తాళం వేశారు. దాదాపు రెండు గంటల పాటు ఆ చిరుత రూంలోనే గడిపింది. ఈ దృశ్యాలన్నింటినీ హోటల్ పనిచేస్తున్న వ్యక్తి, తన ఫోన్లో బంధించాడు. అనంతరం దీనిపై అటవీశాఖ సిబ్బందికి సమాచారం ఇచ్చింది హోటల్ యాజమాన్యం. ఘటనాస్థలికి చేరుకున్న అధికారులు, చాకచక్యంగా చిరుత పులిని పట్టుకొని బోనులో బంధించారు. అనంతరం వైద్యపరీక్షలు నిర్వహించి దానిని నహర్‌ఘర్ బయోలాజికల్ పార్కులో విడిచిపెట్టారు. చిరుత ప్రవేశించిన గదిలో ఉంటున్న టూరిస్టు బయటకు వెళ్లడం వల్ల పెద్ద ప్రాణాపాయం తప్పినట్లయింది. కాగా, హోటల్లోకి చిరుత ప్రవేశించిందని తెలుసుకున్న మిగతా టూరిస్టులు వెంటనే అక్కడి నుంచి సురక్షిత ప్రాంతానికి తరలివెళ్లారు.