Chandrayaan 3 Rakhi Viral Video : విద్యార్థుల 'చంద్రయాన్-3' రాఖీ.. ఎవరి కోసమో తెలుసా..? - chandrayan 3 Latest news
🎬 Watch Now: Feature Video
Published : Aug 31, 2023, 4:06 PM IST
Chandrayaan 3 Rakhi Viral Video in Jagtial : రాఖీ పౌర్ణమి(Rakhi Purnima 2023) సందర్భంగా జగిత్యాల జిల్లాలోని కోరుట్ల బాలికల ప్రభుత్వ ఉన్నత పాఠశాల విద్యార్థినిలు వినూత్నంగా ఆలోచించారు. ఇస్రో ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన చంద్రయాన్-3 విజయవంతం కావడంతో విద్యార్థులు చంద్రయాన్-3ని పోలిన రాఖీని తయారు చేశారు. చుట్టూ సూర్యుడు, మధ్యలో చంద్రుడు, మూన్ మధ్యలో రాకెట్, ల్యాండర్ విక్రమ్, ఇస్రో ఛైర్మన్ సోమనాథ్ చిత్రపటాలతో పెద్ద రాఖీని రూపొందించారు. ఈ రాఖీని పాఠశాలలో ప్రదర్శనకు ఉంచారు. ఛైర్మన్ సోమనాథన్కు కానుకగా ఈ రాఖీని పంపిస్తున్నట్లు విద్యార్థినులు తెలిపారు.
Students Chandrayaan 3 Rakhi : చంద్రయాన్-3 విజయవంతం వల్ల భారతదేశం కీర్తి పెరిగిందని.. భారత ప్రజలుగా ఆనంద పడుతున్నామని విద్యార్థులు హర్షం వ్యక్తం చేశారు. ఇలాంటి మరిన్ని ప్రయోగాలు భవిష్యత్లో చేపట్టాలని ఆకాంక్షించారు. ప్రదర్శనకు ఉంచిన రాఖీ అందరినీ ఆకట్టుకుంటుంది. విద్యార్థులు సాంకేతిక విషయాలు, అంతరిక్షం పట్ల ఆసక్తి.. ఇతర అంశాల్లో పరిజ్ఞానం పెంచేందుకే ఈ రాఖీ తయారిని ప్రోత్సహించామని పాఠశాల ఉపాధ్యాయులు చెప్పారు.