Purushottam Rupala Visited Edupayala Temple : ఏడుపాయల వన దుర్గామాత సన్నిధిలో కేంద్రమంత్రి రూపాలా - Telangana latest news
🎬 Watch Now: Feature Video

Central Minister Purushottam Rupala visited Edupayala temple : మెదక్ జిల్లాలోని ప్రసిద్ధ పుణ్యక్షేత్రం ఏడుపాయల వన దుర్గామాతను కేంద్ర మత్స్య, పశు సంవర్ధక, పాడి పరిశ్రమ శాఖ మంత్రి పురుషోత్తం రూపాల దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆలయ ఈవో సారా శ్రీనివాస్, ఆలయ అర్చకులు పూర్ణకుంభంతో ఘనంగా ఆయనకు స్వాగతం పలికారు. ఆషాఢ మాసం మొదటి ఆదివారం పురస్కరించుకొని ఏడుపాయల వన దుర్గాభవాని మాతకు ఆలయ అర్చకులు లక్ష గాజులతో విశేష అలంకరణ చేశారు. తెల్లవారుజామున అమ్మవారికి సహస్ర నామార్చన, కుంకుమార్చన, ప్రత్యేక అభిషేకం నిర్వహించారు. ఆషాఢం మొదటి ఆదివారం కావడంతో భక్తులు పెద్ద సంఖ్యలో దర్శించుకుంటున్నారు.
తెల్లవారుజాము నుంచే మంజీరా స్నానం ఆచరించి అమ్మవారికి మొక్కులు చెల్లించుకుంటున్నారు. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అన్ని ఏర్పాట్లు చేసినట్లు ఆలయ ఈవో, ఛైర్మన్ తెలిపారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీసులు పటిష్ఠ బందోబస్తు ఏర్పాటు చేశారు. కేంద్రమంత్రి పురుషోత్తం రూపాలను ఆలయ ఈవో శాలువతో ఘనంగా సత్కరించి తీర్థ ప్రసాదాలు అందజేశారు.