కల్యాణ మండపంలో 30 నిమిషాలు బుల్ ఫైట్.. ఆఖరికి - బుల్ ఫైట్ గుజరాత్ పెళ్లి వైరల్ వీడియో
🎬 Watch Now: Feature Video
గుజరాత్.. అమ్రేలీ జిల్లా చలాలా గ్రామంలో రెండు ఎద్దులు హల్ చల్ సృష్టించాయి. ఏకంగా వివాహం జరిగే కల్యాణ మండపంలోకి వచ్చి పొట్లాడుకున్నాయి. ఈ ఘర్షణతో మండపంలోని నూతన వధూవరులతో పాటు అతిథులందరూ కంగుతిన్నారు. సుమారు 30 నిమిషాలపాటు బసవన్నలు కొట్లాడుకున్నాయి. దీంతో అరగంట సేపు పెళ్లి క్రతువు ఆగిపోయింది. ఈ దృశ్యాలను పెళ్లికి వచ్చిన అతిథులు ఆసక్తిగా గమనించారు. అనంతరం వీటిని తమ మొబైల్లో ఫొటోలు, వీడియోలు తీశారు. గొడవ సమయంలో ఎద్దులను విడిపించేందుకు కొందరు వాటిపై నీళ్లు పోశారు. కానీ, ఎవరూ వాటి దగ్గరకు వెళ్లే ప్రయత్నం చేయలేదు. అయితే ఈ ఘటనలో ఎవరికీ ఎటువంటి గాయాలు కాకపోవడం వల్ల అందరూ ఊపిరి పీల్చుకున్నారు. కాగా, కొద్దిసేపటికి ఎద్దులు శాంతించి పెళ్లి వేదిక నుంచి వెనుదిరగడం వల్ల తిరిగి పెళ్లి క్రతువు ప్రారంభమైంది. నవ దంపతులిద్దరూ ఒకట్టయ్యారు. ఇక బుల్ ఫైట్‌కి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. దీంతో నెటిజెన్లు ఫన్నీగా కామెంట్స్ పెడుతున్నారు.