మంచిర్యాల జిల్లాలో పోలీసులపై బీఆర్ఎస్​ సర్పంచ్​ అనుచరుల దాడి - BRS leaders attack on constable

🎬 Watch Now: Feature Video

thumbnail

By ETV Bharat Telangana Team

Published : Nov 23, 2023, 4:48 PM IST

BRS Sarpanch Attacked The Police In Mancherial : పోలీసులపై బీఆర్​ఎస్​ నాయకుల దాడి చేసిన ఘటన మంచిర్యాలజిల్లాలోని కన్నెపెల్లి మండలం వీరాపూర్ గ్రామంలో చోటు చేసుకుంది. బీఆర్ఎస్ అభ్యర్థి సర్పంచ్ అశోక్ గౌడ్​తో పాటు అతని కుమారుడు జిల్లెల మహేశ్​ గౌడ్​ మరి కొంతమంది కలిసి ఆమెపై దాడి చేశారు. బుధవారం రాత్రి ఆ పార్టీ​ యువజన విభాగం నియోజకవర్గ అధ్యక్షుడు మహేష్ గౌడ్ మహిళను బెదిరించడంతో.. ఆమె డయల్ 100కు కాల్ చేసింది.

Sarpanch Attack On Police : కన్నేపల్లి పోలీసులు ఘటన స్థలానికి చేరుకొని గొడవ అదుపు చేయడానికి ప్రయత్నించారు. ఇదే సమయంలో మహేష్ గౌడ్​తో పాటు 15 మంది వ్యక్తులు పోలీసులతో దుర్భాషలాడి దాడికి దిగారు. ఈ గొడవను వీడియో చిత్రీకరణ చేస్తున్న  కానిస్టేబుళ్లు శ్రీనివాస రావు, తులసిరామ్ ఫోన్లను లాక్కున్నారు. దీనిపై పోలీసులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు​... సర్పంచ్ అశోక్ గౌడ్, మహేష్ గౌడ్​తో పాటు మరో 15 మందిపై కేసు నమోదు చేశామని కన్నెపల్లి ఎస్సై నరేశ్​ తెలిపారు.  

ABOUT THE AUTHOR

...view details

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.