BRS MP Vaddiraju Ravichandra Interview : ఖమ్మంపై కేసీఆర్ స్పెషల్ ఫోకస్ పెట్టారు.. 10కి 10 స్థానాలూ గెలుస్తాం : వద్దిరాజు రవిచంద్ర - బీఆర్ఎస్ ఎంపీ రవిచంద్ర ఎలక్షన్ ఇంటర్వూ
🎬 Watch Now: Feature Video
Published : Oct 11, 2023, 2:02 PM IST
BRS MP Vaddiraju Ravichandra Interview : ఎన్నికలు సమీపిస్తున్న వేళ ముఖ్యమంత్రి కేసీఆర్ ఉమ్మడి ఖమ్మం జిల్లాపై శ్రద్ద పెట్టారని బీఆర్ఎస్ రాజ్యసభ ఎంపీ వద్దిరాజు రవిచంద్ర అన్నారు. నియోజకవర్గాల వారీగా బహిరంగ సభలకు శ్రీకారం చుట్టిన కేసీఆర్.. ఖమ్మం, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలపై ప్రత్యేక దృష్టి సారించారని, అభ్యర్థులను ప్రకటించి ఎన్నికల ప్రచారంలో ముందున్న బీఆర్ఎస్ అభ్యర్థులు, పార్టీ శ్రేణుల్లో జోష్ నింపడమే లక్ష్యంగా తొలి దఫాలో 5 నియోజకవర్గాల్లో భారీ బహిరంగ సభల్లో ముఖ్యమంత్రి కేసీఆర్ పాల్గొనేలా పార్టీ ప్రణాళికలు చేస్తోందని తెలిపారు. పాలేరు నుంచి జిల్లాలో ప్రచారపర్వం మొదలుపెట్టి ఎన్నికల శంఖరావం పూరించేందుకు సిద్ధమవుతోందని ఎంపీ పేర్కొన్నారు.
Rajyasabha MP Vaddiraju Ravichandra On Elections : ఈ నెల 27న పాలేరు నియోజకవర్గంలో భారీ బహిరంగ సభలో ముఖ్యమంత్రి కేసీఆర్ పాల్గొననున్నారని ఆయన తెలిపారు. తర్వాత నవంబర్ 1, 4 తేదీల్లో మరో నాలుగు నియోజకవర్గాల్లో భారీ బహిరంగ సభలు నిర్వహించేలా పార్టీ పక్కా ప్లాన్ వేస్తోందని చెప్పారు. రాష్ట్రంలోనే ఎక్కడా లేనివిధంగా కేవలం ఉమ్మడి ఖమ్మం జిల్లాలోని 10 అసెంబ్లీ నియోజకవర్గాలకు ఎన్నికల ఇంఛార్జీలను నియమించారని.. ఈసారి జిల్లాలో 10కి 10 స్థానాలు గెలవడమే బీఆర్ఎస్ లక్ష్యమని ఎంపీ విశ్వాసం వ్యక్తం చేశారు. సీఎం కేసీఆర్ రాకతో జిల్లాలో పూర్తి స్థాయిలో సమరశంఖం పూరిస్తామంటున్న ఎంపీ వద్దిరాజు రవిచంద్రతో ఈటీవీ భారత్ ప్రత్యేక ముఖాముఖి..