BRS ఎమ్మెల్సీ కవితకు వినూత్నంగా బర్త్ డే విషెస్.. సముద్రంలోకి వెళ్లి మరీ.. - కవిత బర్త్​డే

🎬 Watch Now: Feature Video

thumbnail

By

Published : Mar 13, 2023, 11:41 AM IST

Birthday wishes to MLC Kavitha : నేడు బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత పుట్టినరోజు. ఈ సందర్భంగా ఆ పార్టీ నేతలు, కార్యకర్తలు, ప్రజా ప్రతినిధులు, అభిమానులు ఆమెకు జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. అభిమానులు అంతా వారికి తోచినట్టుగా బర్త్ డే విషెస్ చెబుతున్నారు. అయితే ఓ బీఆర్​ఎస్​ నేత మాత్రం కాస్త వెరైటీగా ట్రై చేశారు. ఎమ్మెల్సీ కవితకు వినూత్న రీతిలో జన్మదిన శుభకాంక్షలు తెలిపి తమ అభిమానన్ని చాటుకున్నారు. 

నిజామాబాద్‌కు చెందిన బీఆర్​ఎస్​ నాయకుడు చిన్నుగౌడ్‌ సముద్రపు అడుగులోకి వెళ్లి ఎమ్మెల్సీ కవితకు జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. సముద్రం లోపలికి ఎమ్మెల్సీ కవితకు బర్త్ డే విషెస్ రాసి ఉన్న బ్యానర్లలను ప్రదర్శించారు. చిన్నుగౌడ్​ తన బృందంతో సముద్రపు అడుగుభాగంలో బ్యానర్లు ప్రదర్శిస్తూ శుభాకాంక్షలు తెలిపారు. 

అండమాన్‌ నికోబార్‌ దీవుల్లో బంగాళాఖాతం సముద్రపు అడుగుభాగాన 'హ్యపీ బర్త్​డే కవిత అక్క' అని రాసి ఉన్న బ్యానర్లను చిన్ను గౌడ్ ప్రదర్శించారు. మరికొన్ని జెండాలపై కల్వకుంట్ల 'కవితకు జన్మదిన శుభాకాంక్షలు' అంటూ బ్యానర్లు ప్రదర్శించి తమ ప్రత్యేకతను చాటుకున్నారు. సముద్రం దిగువన ఆక్సిజన్​ సిలిండర్​లు పెట్టుకొని అటూ ఇటూ తిరుగుతూ ప్రదర్శించిన బ్యానర్లు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. దీనికి సంబంధించిన వీడియోను టీఎస్‌ ఫుడ్స్‌ ఛైర్మన్‌ మేడే రాజీవ్‌ సాగర్‌ హైదరాబాద్‌లో విడుదల చేశారు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతోంది. 

ABOUT THE AUTHOR

author-img

...view details

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.