BRS Human Resource center at Kokapet : బీఆర్​ఎస్​ మానవ వనరుల కేంద్రానికి కేసీఆర్ శంకుస్థాపన - BRS Human Resource center at Kokapet

🎬 Watch Now: Feature Video

thumbnail

By

Published : Jun 5, 2023, 1:39 PM IST

Foundation of BRS Human Resource center in kokapet : భారత్ రాష్ట్ర సమితి ఏర్పాటు చేయతలపెట్టిన మానవ వనరుల కేంద్రానికి ఆ పార్టీ అధినేత, ముఖ్యమంత్రి కేసీఆర్‌ భూమిపూజ చేశారు. పార్టీ నేతలకు, కార్యకర్తలకు శిక్షణ ఇచ్చేందుకు ఏర్పాటు చేయనున్న ఈ కేంద్రం భవన నిర్మాణానికి మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎంపీలతో కలిసి సీఎం కేసీఆర్‌ భూమి పూజ చేశారు. "ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఎక్సలెన్స్ అండ్ హ్యూమన్ డెవలప్‌మెంట్' పేరుతో హైదరాబాద్​లోని కోకాపేటలో బీఆర్​ఎస్​ ఈ కేంద్రాన్ని ఏర్పాటు చేస్తోంది. 

పార్టీ నేతలకు శిక్షణ, సంబంధిత కార్యకలాపాల కోసం ప్రత్యేకంగా భవనాన్ని నిర్మించాలని బీఆర్​ఎస్​ నిర్ణయంచింది. ఇందుకోసం కోకాపేటలోని 239, 240 సర్వే నంబర్లకు చెందిన 11 ఎకరాల భూమిని బీఆర్​ఎస్​కు ఇటీవల మంత్రివర్గ సమావేశంలో కేటాయించారు. వీలైనంత త్వరగా నిర్మాణం చేపట్టాలన్న ఉద్దేశంతో వెంటనే భవన నిర్మాణం కోసం అనుమతులు తీసుకునే ప్రక్రియను చేపట్టారు. బీఆర్ఎస్​ ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఎక్సలెన్స్ కోసం అన్ని రకాల అనుమతులు లభించినట్లు సమాచారం. పార్టీ నేతలు, శ్రేణులకు శిక్షణ ఇవ్వడం, గ్రంథాలయాలు, సెమినార్ హాల్స్, వసతి సౌకర్యం ఉండేలా భవనాన్ని నిర్మించనున్నారు.

ABOUT THE AUTHOR

author-img

...view details

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.