'30 తారీఖు మన వేలి మీద ఇంకు.. ఆ తర్వాత స్టేట్ అంతా పింకే పింకు'.. BRS నేతల నెక్స్ట్ లెవెల్ ప్రచారం - BRS Candidates Variety Campaign in Telangana 2023
🎬 Watch Now: Feature Video
Published : Oct 31, 2023, 2:03 PM IST
BRS Candidates Variety Campaign in Telangana 2023 : రాష్ట్రంలో ఎన్నికల షెడ్యూల్ వచ్చినప్పటి నుంచి ప్రధాన పార్టీలన్నీ తమ ప్రచారాలను ముమ్మరం చేశాయి. ఆయా పార్టీల అభ్యర్థులు ఇంటింటి ప్రచారాలు చేస్తూ.. తమకే ఓటు వేసి గెలిపించాలంటూ ఓటర్లను అభ్యర్థిస్తున్నారు. ముఖ్యంగా అధికార బీఆర్‌ఎస్ పార్టీ ప్రచారంలో దూసుకెళ్తోంది. ఓవైపు పార్టీ అధినేత సభలతో పాటు అభ్యర్థులు ఎక్కడికక్కడ వాడవాడలా తిరుగుతూ రాష్ట్ర ప్రగతిని వివరిస్తున్నారు. దీంతోపాటు సోషల్ మీడియాలోనూ పెద్ద ఎత్తున ప్రచారం చేస్తున్నారు. ప్రత్యేకంగా టీమ్‌లను ఏర్పాటు చేసుకుని మరీ.. ఆకట్టుకునేలా మీమ్స్, క్యాచీ స్లోగన్స్‌తో యువతను ఆకర్షించే ప్రయత్నం చేస్తున్నారు.
BRS Candidates Catchy Slogans In Election Campaign 2023 : ముఖ్యంగా బీఆర్‌ఎస్ నేతలు ప్రచారంలో కొత్త ట్రెండ్ సెట్ చేస్తున్నారు. సాధారణ ఓటర్లతో పాటు యువ ఓటర్లను ఆకట్టుకునేలా రొటీన్‌కు, ప్రతిపక్ష పార్టీలకు భిన్నంగా ప్రచారం హోరెత్తిస్తున్నారు. మంత్రి మల్లారెడ్డి ఈ వరుసలో అందరికంటే ముందుండగా.. ఇతర మంత్రులూ ఇదే రూట్ ఫాలో అవుతున్నారు. ఈ ఎన్నికల్లోనూ మెజారిటీ తగ్గేదే లే అంటూ దూసుకెళ్తున్నారు. 'మన కళ్ల ముందు ఎదిగింది కరీంనగర్.. దానికి కారణం మన అన్న గంగుల కమలాకర్, అప్పడెట్లుండే తెలంగాణ.. ఇప్పుడెట్లైందీ తెలంగాణ, 30వ తారీఖు వేలుకు ఉండాలే ఇంకు.. ప్రతిపక్షాలన్నీ జంపో జంపు, 30వ తారీఖున మన వేలికి ఉండాలే ఇంకు.. ఆ తర్వాత స్టేట్ అంతా పింకే పింకు..' అంటూ క్యాచీ స్లోగన్స్‌తో బీఆర్ఎస్ మంత్రులు మల్లారెడ్డి, శ్రీనివాస్ గౌడ్, గంగుల కమలాకర్ ప్రచారంలో నయా ట్రెండ్ క్రియేట్ చేస్తున్నారు. ఇందుకు సంబంధించి వీడియో ఒకటి నెట్టింట తెగ వైరల్ అవుతోంది. మీరూ ఓసారి చూసేయండి.