పదేళ్ల కేసీఆర్, ప్రస్తుత కాంగ్రెస్ పరిపాలన ఒకేలా ఉంది : ఎన్వీఎస్ఎస్ ప్రభాకర్ - bjp leaders Comments on Congress
🎬 Watch Now: Feature Video


Published : Jan 13, 2024, 7:59 PM IST
BJP Leader NVSS Prabhakar Fires on Congress Government : పదేళ్ల కేసీఆర్, ప్రస్తుత కాంగ్రెస్ పరిపాలన సాగు నీటి ప్రాజెక్టుల విషయంలో ఒకే ధోరణిలా కనిపిస్తోందని బీజేపీ విమర్శించింది. కాంగ్రెస్ అనుసరిస్తున్న సమీక్షలు, ప్రకటనలు, పర్యటనల్లో మొత్తం కనిపిస్తుందన్నారు. కేసీఆర్ ఫామ్‌హౌస్ నుంచి పాలిస్తే, రేవంత్ రెడ్డి దిల్లీ వేదికగా పాలన సాగిస్తున్నారని ఆ పార్టీ నేత ఎన్వీఎస్ఎస్ ప్రభాకర్ ఎద్దేవా చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వంలో లక్షల్లో రేషన్ కార్డులను తొలగించాలనే ప్రయత్నాలు జరుగుతున్నాయని ఆరోపించారు. ఒక్క రేషన్ కార్డు తొలిగించినా, బాధితుల పక్షాన బీజేపీ పోరాడుతుందని స్పష్టం చేశారు.
ఉచిత ప్రయాణ హామీకి స్పష్టమైన ప్రణాళిక లేదని ఆక్షేపించారు. దాని వల్ల ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని తెలిపారు. ప్రాజెక్టు డిజైన్ల పేరుతో గత ప్రభుత్వం చాలా దోచుకుందని, అదే తరహాలో కాంగ్రెస్ సర్కార్ కూడా చేస్తుందని విమర్శించారు. ఆరు గ్యారంటీల అమలులో కాంగ్రెస్ ప్రభుత్వం పూర్తిగా విఫలమైందన్నారు. వంద రోజుల్లో ఆరు గ్యారంటీలను అమలు చేస్తామన్న కాంగ్రెస్, ఇప్పటి వరకు రెండు గ్యారంటీలకే పరిమితమైందని మండిపడ్డారు.