Bhadrachalam Godavari river has accumulated silt : భద్రాద్రి స్నానఘట్టాల వద్ద పేరుకుపోయిన బురద.. భక్తులకు తీవ్ర ఇబ్బందులు..
🎬 Watch Now: Feature Video
Published : Sep 21, 2023, 5:28 PM IST
Bhadrachalam Godavari river has accumulated silt : రాష్ట్రవ్యాప్తంగా కురిసిన భారీ వర్షాలు, ఎగువ ప్రాంతాల నుంచి వచ్చిన వరదతో భద్రాద్రి కొత్తగూడెం జిల్లా భద్రాచలం గోదావరి (Bhadrachalam Godavari River) పరివాహక ప్రాంతాల్లో బురద పేరుకుపోయింది. దీంతో గోదావరి నదిలో స్నానం చేయడానికి వచ్చే భక్తులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. రెండు రోజుల క్రితం భద్రాచలం వద్ద గోదావరి నీటిమట్టం 36 అడుగుల వరకు పెరిగింది. తరవాత వరద ప్రవాహం తగ్గడంతో గోదావరి నది(Godavari River) ఒడ్డున మొత్తం మోకాళ్ల లోతు బురద పేరుకుపోయింది. ప్రస్తుతం గోదావరి వరద 23 అడుగుల వరకు ఉంది. నది ఒడ్డున ఉన్న స్నాన ఘట్టాల వద్ద ఒండ్రు మట్టి పేరుకుపోవడంతో, పుణ్యస్నానాలు చేసేందుకు వచ్చే భక్తులకు తీవ్ర అసౌకర్యం కలుగుతోంది. మరోవైపు గణేశ్ నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా విగ్రహాలను నదిలో నిమజ్జనం చేసేందుకు వచ్చే భక్తులకు బురద ఇబ్బందిగా మారింది.
హైదరాబాద్ నుంచి వచ్చిన నీటిపారుదల శాఖ ప్రత్యేక నిపుణుల కమిటీ, పడవల ద్వారా గోదావరి నదిలోకి వెళ్లి ఆధునిక పరికరాలతో వరద ప్రవాహాన్ని, లోతును ఎలా అంచనా వేయాలి అనే విషయాలను పరిశీలిస్తున్నారు. ఈ ఆధునిక పరికరంతో భారీ స్థాయిలో వరదలు వచ్చినప్పుడు ప్రవాహాన్ని అంచనా వేయడం సులభమని నీటిపారుదల శాఖ ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్ శర్మ తెలిపారు.