రాజకీయ కుట్రలో భాగంగానే నాపై ఐటీ దాడులు : బడంగ్‌పేట్ మేయర్ పారిజాత - Mayor Parijata is worried about IT attacks
🎬 Watch Now: Feature Video
Published : Nov 3, 2023, 5:35 PM IST
Badangpet Mayor Reacts To IT Raids : బడంగ్‌పేట్ మున్సిపల్ కార్పొరేషన్ మేయర్ పారిజాత నర్సింహారెడ్డి ఇంట్లో.. గురువారం తెల్లవారుజాము నుంచి అర్ధరాత్రి వరకు ఐటీ అధికారులు సోదాలు నిర్వహించారు. తనిఖీల్లో డబ్బు బయటపడినట్లు వస్తున్న వార్తలు కేవలం రాజకీయ ప్రచారమేననీ.. స్థిరాస్తి వ్యాపారానికి సంబంధించిన పత్రాలు, చరవాణులను మాత్రమే అధికారులు సీజ్ చేసి.. తీసుకెళ్లినట్లు మేయర్ పారిజాత తెలిపారు. గురువారం జరిగిన దాడులలో భారీ మెుత్తంలో డబ్బు పట్టు పడిందనే దాంట్లో నిజం లేదన్నారు. ఇవన్నీ అవాస్తవాలు మాత్రమేనని .. కేవలం ప్రతిపక్ష పార్టీల కుట్రలో భాగంగా మాపై దాడులు జరిగాయని పారిజాత ఆవేదన వ్యక్తం చేశారు.
ఎన్నికల సమయంలో ఐటీ దాడులు జరపడం సమంజసం కాదన్నారు. ఈసారి మహేశ్వరం నియోజక వర్గం నుంచి కాంగ్రెస్ అభ్యర్థిగా రేసులో ఉన్నట్లు ఆమె తెలిపారు. కాంగ్రెస్ పార్టీ తనకు బీ ఫాం ఇస్తుందని ధీమా వ్యక్తం చేశారు. రాహుల్‌గాంధీ సైతం మహిళ అభ్యర్థికి చోటు కల్పించాలనే విషయంపై అనుకూలంగా స్పందించారని చెప్పారు. టికెట్ రాని పక్షంలో కార్యకర్తలను సలహా మేరకు నిర్ణయం తీసుకుంటానని మున్సిపల్ కార్పొరేషన్ మేయర్ పారిజాత వెల్లడించింది.