రైతుల పంట బీమా సొమ్మును బీజేపీ ప్రభుత్వం భరిస్తుంది : అమిత్ షా - అమిత్ షా కామెంట్స్ ఆన్ కాళేశ్వరం
🎬 Watch Now: Feature Video
Published : Nov 20, 2023, 5:26 PM IST
Amit Shah Public Meeting at Metpalli : ప్రధాని మోదీ నాయకత్వంలో దేశ ఆర్థిక వ్యవస్థ ఐదో స్థానానికి చేరిందని కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా అన్నారు. జగిత్యాల జిల్లాలోని మెట్పల్లిలో బీజేపీ సకల జనుల విజయ సంకల్ప సభలో అమిత్ షా పాల్గొన్నారు. కేసీఆర్ హైదరాబాద్ విమోచన దినోత్సవం నిర్వహించరని.. బీజేపీ వస్తే తెలంగాణ విమోచన దినాన్ని రాష్ట్ర దినోత్సవంగా నిర్వహిస్తామని తెలిపారు. బీజేపీ(BJP) వస్తే కుటుంబపార్టీ నుంచి తెలంగాణకు విముక్తి లభిస్తుందని ఆశా భావం వ్యక్తం చేశారు.
Amit Shah Interesting Comments on KCR : మోదీ ప్రభుత్వ హయాంలోనే తెలంగాణకు సరైన న్యాయం లభిస్తుందని అమిత్ షా(Amit Shah) అన్నారు. బీఆర్ఎస్ ప్రభుత్వం అవినీతిలో కూరుకుపోయిందని ఆరోపించారు. మిషన్ భగీరథ, మిషన్ కాకతీయ, ఔటర్ రింగ్‌రోడ్డు, మియాపూర్ భూకుంభకోణానికి అవినీతికి పాల్పడ్డారని మండిపడ్డారు. బీజేపీ వస్తే అవినీతి నాయకులను జైలుకు సాగనంపుతామని హెచ్చరించారు. రైతుల పంట బీమా సొమ్మును బీజేపీ ప్రభుత్వం భరిస్తుందని అన్నారు.పేదలకు రూ.10 లక్షల వరకు వైద్య ఖర్చుల భరిస్తామని హామీ ఇచ్చారు. తమ ప్రభుత్వం వస్తే ఐదేళ్లలో 2.5 లక్షల ప్రభుత్వ ఉద్యోగాలు కల్పిస్తామని.. తెలంగాణను అగ్రస్థానంలో నిలబెడతామని పేర్కొన్నారు.