Agriculture Drones in Sangareddy: 6 నిమిషాల్లో ఎకరం పొలానికి మందు పిచికారి.. డ్రోన్లతో సాగులో దూసుకెళ్తున్న రైతన్న - Agriculture Drones in Sangareddy
🎬 Watch Now: Feature Video


Published : Sep 22, 2023, 2:54 PM IST
Agriculture Drones in Sangareddy : ప్రస్తుత తరుణంలో రైతును ప్రధానంగా వేధిస్తున్న సమస్యల్లో కూలీల కొరత ఒకటి. సమయానికి కూలీలు దొరక్కపోవడం.. దొరికినా వారికి కూలీ డబ్బు చెల్లించలేక కర్షకులు సాగు కష్టాలు ఎదుర్కొంటున్నారు. ఈ సమస్యను అధిగమించడానకి అన్నదాతలు.. సాంకేతికత వైపు మళ్లుతున్నారు. పంట చేలలో వచ్చే చీడపీడలు, వివిధ రకాల తెగుళ్లను నియంత్రించడానికి డ్రోన్ స్ప్రేయర్లను వినియోగిస్తున్నారు. తక్కువ సమయంలో డ్రోన్ స్ప్రేయర్ సాయంతో పంటకు క్రిమిసంహారకాలను పిచికారి చేస్తూ కూలీల కొరతను అధిగమిస్తున్నారు.
Pesticide Drones Sangareddy : డ్రోన్ల సాయంతో ఎకరాకు 500 రూపాయల ఖర్చుతో.. 6 నిమిషాల్లోనే ఎకరం పొలంలో విస్తీర్ణంలో మందు పిచికారి చేస్తున్నారు. సంగారెడ్డికి చెందిన కృష్టయ్య అనే రైతు 6 లక్షల రూపాయలతో డ్రోన్ కొనుగోలు చేసి తమ పొలంతో పాటు.. ఇతరుల పొలంలో సైతం పిచికారి చేస్తున్నారు. దీంతో కూలీల బాధ తగ్గడంతో పాటు.. తక్కువ సమయంలోనే ఎక్కువ విస్తీర్ణంలో మందు పిచికారి చేసుకోగలుగుతున్నామని అంటున్నారు. ఈ నేపథ్యంలో డ్రోన్ల గురించి.. వాటితో పంటకు మందు పిచికారి చేయడం గురించి అన్నదాతలతో మా ప్రతినిధి రామకృష్ణ ముఖాముఖి...