హైదరాబాద్‌లో సందడి చేసిన నటి రష్మీ ఠాకూర్ - మిస్ ఆసియా బ్యూటీ రష్మీ వార్తలు
🎬 Watch Now: Feature Video
![ETV Thumbnail thumbnail](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/12-12-2023/640-480-20252036-thumbnail-16x9-actress-rashmi-thakoor-1.jpg)
![ETV Bharat Telangana Team](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/authors/telangana-1716536068.jpeg)
Published : Dec 12, 2023, 9:21 PM IST
Actress Rashmi Thakur Visited Indian Silk Gallery Exhibition : చేనేత కార్మికులకు చేయూత ఇచ్చేందుకు హైదరాబాద్ శ్రీనగర్‌కాలనీలో ఏర్పాటు చేసిన ఇండియన్ సిల్క్ గ్యాలరీ ఎగ్జిబిషన్ చూపరులను ఎంతగానో ఆకట్టుకుంటుంది. వారం రోజుల పాటు కొనసాగే ఈ ప్రదర్శనను మిస్ ఏషియా ఇంటర్నేషనల్, నటి రష్మీ ఠాకూర్ సందర్శించారు. ఈ సందర్భంగా వివిధ రాష్ట్రాలకు చెందిన చేనేత ఉత్పత్తులను తిలకిస్తూ, ఫొటోలకు పోజులిస్తూ అభిమానులను అలరించారు. చేనేత ఉత్పత్తులు మగువల మనసుదోచుకొనేలా ఉన్నాయని మిస్ ఏషియా ఇంటర్నేషనల్, నటి రష్మీ ఠాకూర్ అన్నారు.
ఎగ్జిబిషన్‌లోని చీరలను చూసి చేనేత కళాకారుల ప్రతిభను ప్రశంసించారు. దేశంలోని ప్రముఖ నగరాలకు చెందిన చేనేత కళాకారులు తయారు చేసిన ఉత్పత్తులు నగరవాసులకు పరిచయం చేస్తున్నట్లు నిర్వాహకులు వినయ్ కుమార్, శ్రీనివాసరావు తెలిపారు. ఇందులో చెందేరి, ఝార్ఖండ్, ఇక్కత్, పోచంపల్లి, నానాయత్పేట్, బెనారస్, కోలకతా మొదలగు నగరాలకు సంబంధించిన చేనేత ఉత్పత్తులను 14 రాష్ట్రాలకు చెందిన చేనేతకారులు అందిస్తున్నట్లు వివరించారు.
TAGGED:
చేనేత కళాకారుల ప్రతిభ