young man from Hyderabad married Mexican girl : హైదరాబాదీ అబ్బాయికి మెక్సికో అమ్మాయితో ప్రేమవివాహం - హైదరాబాద్‌లో ఖండాతర వివాహం
🎬 Watch Now: Feature Video
young man from Hyderabad married a Mexican girl : ఒకప్పుడు పెళ్లి సంబంధం కోసం తెలిసిన వాళ్లతోనో.. ఊర్లోని పురోహితుడి ద్వారానో వెతికేవారు. ఇప్పుడు ట్రెండ్ మారింది. మ్యారేజ్ బ్యూరోలు, సామాజిక మాధ్యమాల్లో పెళ్లి సంబంధాలు వెతకడం ప్రారంభమైంది. ప్రేమ వివాహాలు క్రమంగా పెరుగుతున్నాయి. ఈ సమయంలో ప్రేమ.. కుల మతాల గోడలను బద్దలుకొట్టి ఖండాంతరాలు దాటుతోంది. పిల్లల ప్రేమను కాదనలేక పెద్దలు కుడా పచ్చజెండా ఊపుతున్నారు. అలాంటి ఖండాంతర ప్రేమ వివాహమే భాగ్యనగరంలో జరిగింది.
హైదరాబాద్ అంబర్పేట్ చెందిన యోల్లంకి సమ్మక్క, మల్లయ్య దంపతుల కుమారుడు సందీప్‌కుమార్, మెక్సికోకు చెందిన లొరెనా రోడ్రిగేజ్ మజోకో- హువాన్ అల్బెరోటో అబుదొ మెనా దంపతుల పుత్రిక లొరాన్స్తో వివాహం ఘనంగా జరిగింది. హిమాయత్‌నగర్‌లోని ఫంక్షన్హాల్లో హిందూ సాంప్రదాయంలో వివాహ వేడుక నిర్వహించారు. సందీప్‌కుమార్ మెక్సికోలోని అక్కడి విశ్వవిద్యాలయంలో ఆరు సంవత్సరాల పీజీకోర్సు చదువుకోవడానికి వెళ్లారు. అక్కడ లొరాన్స్తో పరిచయం ఏర్పడింది. స్నేహం కాస్త ప్రేమగా మారింది. ఆరు సంవత్సరాలు ప్రేమించుకున్నారు. భారతీయ సంస్కృతి సాంప్రదాయం ప్రకారం వివాహం చేసుకుంటామని..పెళ్లికుమారుడు సందీప్‌కుమార్ అమ్మాయి తల్లిదండ్రులను ఒప్పించాడు. భారతదేశ సంస్కృతి సాంప్రదాయాలు చాలా ఇష్టమని.. ఇరువురి పెద్దల అంగీకారంతో వివాహం చేసుకున్నామని వధువు తెలిపింది.