సాయిబాబా వార్షికోత్సవానికి బంగారు సింహాసనం అందజేసిన హైదరాబాద్ వాసి
🎬 Watch Now: Feature Video
మహారాష్ట్రలోని అహ్మద్‌నగర్ జిల్లా కోపర్గావ్ మండలం కుంభారిలో షిరిడి సాయిబాబా ఆలయ ప్రథమ వార్షికోత్సవం వైభవంగా జరిగింది. గత ఏడాది ఇదే సమయానికి కుంభారి వాసుల కోరిక మేరకు షిర్డీకి చెందిన మోహన్ యాదవ్ చొరవతో హైదరాబాద్‌కు చెందిన సాయిభక్తుడు గోపికృష్ణన్ దంపతులు ఈ ఆలయాన్ని నిర్మించి బాబా విగ్రహాన్ని ప్రతిష్టించారు. ఇప్పుడు ప్రథమ వార్షికోత్సవాన్ని పురస్కరించుకుని ఆ దంపతులు మరోసారి తమ భక్తిని చాటుకున్నారు. బాబా విగ్రహానికి సుమారు రూ.7లక్షల విలువ చేసే బంగారు సింహాసనాన్ని చేయించి ఆలయానికి సమర్పించారు. అనంతరం ప్రత్యేక పూజలు నిర్వహించారు.
కుంభారిలో జరిగిన సాయిబాబా వార్షికోత్సవాలలో హైదరాబాద్ నుంచి గోపికృష్ణన్ కుటుంబ సభ్యులు, బంధువులు, బాబా భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. వీరికి కుంభారి వాసులు ఘనస్వాగతం పలికారు. అదే విధంగా బాబా ఊరేగింపును చిన్నపిల్లలు, పెద్దలు ఆనందోత్సహాల నడుమ వైభవంగా నిర్వహించారు. హైదరాబాద్ నుంచి వెళ్లిన సాయి భక్తులు కుంభారి గ్రామస్థులు చూపించిన ప్రేమకు ఆనందంతో ముగ్దులయ్యారు. వారి అభిమానాన్ని ఎప్పటికీ మర్చిపోలేమంటూ భాగ్యనగరం నుంచి వెళ్లిన సాయిభక్తులు పేర్కొన్నారు.