చార్మినార్ వీధుల్లో మువ్వన్నెల రెపరెపలు.. 300 మీటర్ల పతాకంతో ర్యాలీ - rally with 300 metres flag at charminar
🎬 Watch Now: Feature Video
![ETV Thumbnail thumbnail](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/320-214-14286433-627-14286433-1643179604394.jpg)
Rally with 300 meters flag at Charminar: రాష్ట్రంలో 73 వ గణతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. భాగ్యనగరం త్రివర్ణ పతాక ఆవిష్కరణలతో నూతన సొబగులు అద్దుకుంది. మువ్వన్నెల జెండాలతో ప్రజలు.. దేశం పట్ల తమకున్న భక్తి భావాన్ని చాటుకుంటున్నారు. చార్మినార్లో 300 మీటర్ల పొడవైన జాతీయ జెండాతో యువతీయువకులు, నగరవాసులు ర్యాలీ చేపట్టారు. దారులన్నీ దేశభక్తి, త్రివర్ణ పతాక రెపరెపలతో నిండిపోగా.. వీధులు, రహదారులపై ప్రదర్శన చేపడుతున్న డ్రోన్ విజువల్స్ ఆకట్టుకుంటున్నాయి.