KTR birthday song: అదరగొట్టిన 'జయహో కేటీఆర్' సాంగ్.! - minister ktr birthday song
🎬 Watch Now: Feature Video
ఈ నెల 24న తెరాస కార్యనిర్వాహక అధ్యక్షుడు, పురపాలక, ఐటీ శాఖల మంత్రి కేటీఆర్ పుట్టిన రోజు సందర్భంగా.. ఆదిలాబాద్ ఎమ్మెల్యే జోగు రామన్న ఆధ్వర్యంలో ప్రత్యేక పాటను రూపొందించారు. కేటీఆర్‌పై రూపొందించిన పాటను తెలంగాణ భవన్లో గురువారం ఆవిష్కరించారు. కార్యక్రమంలో ఆసిఫాబాద్ ఎమ్మెల్యే ఆత్రం సక్కు, తెరాస రాష్ట్ర ప్రధాన కార్యదర్శి శ్రీనివాస్ రెడ్డితో పాటు పాట దర్శకుడు పూర్ణచందర్, రచయిత మానుకోట ప్రసాద్, సంగీతాన్ని అందించిన బాజీ తదితరులు పాల్గొన్నారు.