road accident: రోడ్డు దాటుతున్న కుటుంబాన్ని బైక్‌తో ఢీకొని... - తెలంగాణ తాజా వార్తలు
🎬 Watch Now: Feature Video
సంగారెడ్డి జిల్లా రామచంద్రాపురం జాతీయ రహదారిపై ప్రమాదం జరిగింది. ద్విచక్ర వాహనదారుడు రోడ్డు దాటుతున్న కుటుంబాన్ని ఢీ కొట్టి పరారయ్యాడు. నెంబరు ప్లేటులేని వాహనంతో ఏమరపాటుగా వచ్చి.. ప్రమాదానికి కారణమయ్యాడు. ఈ ఘటనలో ముగ్గురు కుటుంబ సభ్యులు తీవ్రంగా గాయపడ్డారు. బాధితులను ఆస్పత్రికి తరలించారు. సీసీ కెమెరాల్లో నమోదైన దృశ్యాల ఆధారంగా రామచంద్రాపురం పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.