PRATHIDWANI: బొగ్గు సంక్షోభం ఎందుకు ఉరుముతోంది? విద్యుత్ కోతలు, ఛార్జీల మోతలు తప్పవా?
🎬 Watch Now: Feature Video
బొగ్గు సంక్షోభం తీవ్రస్థాయిలో ఉరుముతోంది. అకాల విద్యుత్ కోతలు ఏం జరుగుతుందోనన్న అయోమయంలో పడేస్తున్నాయి. కొరత మరింత పెరిగితే చీకట్లే అన్న హెచ్చరికలు సమస్య తీవ్రత చెప్పకనే చెబుతున్నాయి. దేశవ్యాప్తంగా సగానికి పైగా థర్మల్ విద్యుత్ కేంద్రాల వద్ద బొటాబొటి నిల్వలే అని చెబుతున్నాయి. ప్రస్తుతం విద్యుదుత్పత్తికి సంబంధించి బొగ్గు సరఫరాలో చోటు చేసుకుంటున్న పరిణామాలు నిజంగా అంత కలవరపడాల్సినవేనా? అనవసరంగా ఆందోళన చెందుతున్నామా? కేంద్రం ప్రభుత్వం ఏం చెబుతోంది? ఆంధ్రప్రదేశ్ పరిణామాలు దేనికి సంకేతం? ఎప్పటిలోపు సాధారణ పరిస్థితులు నెలకొనే అవకాశం ఉంది? ఇదే అంశంపై నేటి ప్రతిధ్వని.