LORD GANESHA: స్వర్ణకార వృత్తిని ప్రతిబింబించేలా వినాయకుడు - వినాయకుడు
🎬 Watch Now: Feature Video
యాదాద్రి భువనగిరి జిల్లా కేంద్రానికి చెందిన గిరిధరా చారి వృత్తిరీత్యా స్వర్ణకారుడు. వినాయక చవితిని పురస్కరించుకుని... తన వృత్తికి సంబంధించిన పనిముట్లతో వినాయకుని ప్రతిమను తయారు చేశాడు. చేతిలో సుత్తి, మరో చేతితో బంగారు కడ్డీ, మరో చేతిలో త్రాసుతో... వినాయకుని ముందు డాకలి, కుంపటి ఉంచి స్వర్ణకార వృత్తిని ప్రతిబింబించేలా విగ్రహాన్ని తయారు చేసి అందరినీ ఆకర్షించారు.