క్షమించమని దండం పెట్టి కాళీమాత నగలు ఎత్తుకెళ్లిన దొంగలు
🎬 Watch Now: Feature Video
ఉత్తర్‌ప్రదేశ్‌లోని మా కాళీ మహాదేవ్ జీ అక్షయ్ మందిర్‌లో దొంగతనం జరిగింది. సోమవారం రాత్రి ఇద్దరు దొంగలు ఈ చోరీకి పాల్పడ్డారు. ఈ ఘటన మొత్తం సీసీటీవీలో రికార్డైంది. దొంగలు ముందుగా కాళీమాతకు దండం పెట్టుకుని.. క్షమించమని మొక్కి మరీ దొంగతనం చేసినట్లు వీడియోలో కనిపిస్తోంది. ఆ తరువాత హుండీలోంచి డబ్బు, వస్తువులు చోరీ చేశారు. దొంగలు గుడి తలుపులు విరగొట్టి లోపలికి వెళ్లినట్లు ఆలయ సిబ్బంది తెలిపారు. నాలుగు బంగారు ఉంగరాలు, ఒక వెండి ఉంగరం, ఓ నెక్లెస్, రూ.వెయ్యి నగదు అపహరణ చేసినట్లు వెల్లడించారు. ఘటనపై పోలీసులకు ఫిర్యాదు చేసినట్లు పేర్కొన్నారు.
Last Updated : Feb 3, 2023, 8:39 PM IST