స్క్రాప్ దుకాణంలో అగ్నిప్రమాదం, భారీ ఎత్తున చెలరేగిన మంటలు - తెలంగాణ క్రైమ్ న్యూస్
🎬 Watch Now: Feature Video
Fire accident in Scrap Godown: రంగారెడ్డి జిల్లాలో భారీ అగ్నిప్రమాదం జరిగింది. రాజేంద్రనగర్ ఆరంఘర్ చౌరస్తా 315 పిల్లర్ వద్ద స్క్రాప్ దుకాణంలో తెల్లవారుజామున మంటలు చెలరేగాయి. సమాచారం అందుకున్న ఫైర్ సిబ్బంది.. 2 అగ్నిమాపక యంత్రాలతో మంటలార్పారు. ప్రమాదం జరిగిన ప్రదేశం పక్కనే వైన్ షాప్ ఉంది. మంటలు ఆ దుకాణానికి అంటుకోకుండా ఫైర్ సిబ్బంది శ్రమించారు. విద్యుదాఘాతంతోనే ఈ ప్రమాదం సంభవించినట్లు పోలీసులు భావిస్తున్నారు. ఘటనలో ఎలాంటి ప్రాణనష్టం జరగలేదు.
Last Updated : Feb 3, 2023, 8:28 PM IST