yoga asanas for leg pain: యోగా.. మానవ ఆరోగ్యానికి కాపాడుకోవడానికి ముఖ్య సాధనం. నిత్యం యోగా సాధనతో సంపూర్ణ ఆరోగ్యవంతులుగా మారే అవకాశముంది. నడుము, మోకాలు నొప్పుల నుంచి చక్కటి ఉపశమనానికి లలాట భూ కపోతాసనం చక్కగా ఉపయోగపడుతుంది.
లలాట భూ కపోతాసనం వల్ల నడుముపై ప్రభావం పడి, బాగా రక్త ప్రసరణ జరుగుతుంది. దీని వల్ల తీవ్రమైన నడుము నొప్పిని తగ్గించుకోవచ్చు. ఈ ఆసనం వల్ల మోకాళ్ల నొప్పులు తగ్గుతాయి. ఆ ఆసనం ఎలా వేయాలంటే...
- ఎడమ మోకాలిపై కూర్చుని మరో కాలిని వెనుకకు చాపాలి. తలను నేలకు తాకించి.. ఒంటి మోకాలిపై కాసేపు ఉండాలి.
- ఆ తర్వాత కుడి మోకాలిని ముందుకు పెట్టి.. కుడికాలు పాదాన్ని నడుము వంచకుండా మెల్లగా అందుకోవాలి.
- కుడికాలిని మడతగా పెట్టి నడుము బాగాన్ని మెల్లగా వంచి.. చేతులను చాపి పృష్ఠ భాగంపై ఒత్తిడి పడేటట్లు చేయాలి.
lalata bhu kapotasanam
లలాట భూ కపోతాసనం వల్ల లాభాలు
- నడుము, మోకాళ్లు నొప్పుల నుంచి ఉపశమనం పొందవచ్చు.
- శరీరమంతటా రక్త ప్రసరణ బాగా జరుగుతుంది.
తీసుకోవాల్సిన జాగ్రత్తలు
- పృష్ఠ భాగాన్ని సమానంగా ఉంచి చేయాలి. లేదంటే మోకాళ్లలో నొప్పి వస్తుంది.
- మోకాళ్లను మడిచి ఆసనాలు చేసేటప్పుడు కొంత నొప్పి అనిపిస్తుంది.
- " class="align-text-top noRightClick twitterSection" data="">
ఇదీ చదవండి: చిన్నపిల్లల్లో అతిసారం.. తీసుకోవాల్సిన జాగ్రత్తలేంటి?