ETV Bharat / sukhibhava

ప్లాస్టిక్ బాటిల్​లో నీళ్లు తాగుతున్నారా..? అయితే ప్రమాదమే! - Health problems caused by plastic water bottles

ప్లాస్టిక్ నీళ్ల బాటిళ్ల వినియోగం వల్ల ఆరోగ్యానికి హాని కలుగుతోందని పరిశోధకులు హెచ్చరిస్తున్నారు. మానవ మలంలో మైక్రోప్లాస్టిక్ కణాలను గుర్తించిన పరిశోధకులు.. రాబోయే ముప్పు గురించి వివరించారు. క్యాన్సర్​తో పాటు పలు రకాల అనారోగ్యాలకు ప్లాస్టిక్ నీళ్ల బాటిళ్ల వినియోగమే కారణం అవుతోందని అంటున్నారు శాస్త్రవేత్తలు.

why-we-should-not-reuse-plastic-water-bottles
ప్లాస్టిక్​ నీళ్ల బాటిళ్లతో కలిగే అనర్ధాలు
author img

By

Published : Feb 8, 2023, 8:44 PM IST

ప్లాస్టిక్ నీళ్ల బాటిళ్లలో నీళ్లు తాగడం అనేది ఇప్పుడున్న పరిస్థితుల్లో సాధారణం అయిపోయింది. అయితే ప్లాస్టిక్ నీళ్ల బాటిళ్లలో నీళ్లు తాగడం వల్ల మన దాహం తీరడం సంగతి పక్కన పెడితే అనేక రోగాలను తీసుకువస్తోందని పరిశోధకులు అంటున్నారు. మానవ శరీరంలోకి మైక్రోప్లాస్టిక్ కణాలు ప్లాస్టిక్ నీళ్ల బాటిళ్ల ద్వారా చేరుతుండటం వల్ల అనారోగ్య సమస్యలు తలెత్తుతున్నాయని వివరిస్తున్నారు.

మానవ మలంలో మైక్రోప్లాస్టిక్ కణాల ఉనికిని కనుగొన్న పరిశోధకులు.. దీర్ఘకాలంలో ఆరోగ్యం మీద ఈ మైక్రోప్లాస్టిక్ కణాలు అనారోగ్యం పాలు చేస్తోందని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ప్లాస్టిక్ తయారీలో వాడే రసాయనాల వల్లే ఈ ప్రభావం ఉంటున్నట్లు పరిశోధకులు గుర్తించారు. ప్లాస్టిక్ నీళ్ల బాటిల్ మూత, సీసాల నుంచి మైక్రోప్లాస్టిక్ కణాలు విడుదల అవుతున్నాయని పరిశోధకులు కనుగొన్నారు. సీసా నుంచి వచ్చే మైక్రోప్లాస్టిక్ రంగు పారదర్శకంగా, మూత నుంచి వచ్చే మైక్రోప్లాస్టిక్ కణాల రంగు నీలం లేదా ఆకుపచ్చ రంగులో ఉండటాన్ని వాళ్లు గమనించారు. ప్లాస్టిక్ నీళ్ల సీసా తయారీలో వాడే పాలిథిలిన్ టెరాఫ్తాలేట్ నుంచి మైక్రోప్లాస్టిక్ కణాలు ఏర్పడుతున్నాయని పరిశోధకులు కనిపెట్టారు.

ప్లాస్టిక్ నీళ్ల సీసాలను తరలించడం, వాటిని ఊపడం, తయారీ కేంద్రాల్లో ఎక్కువ పీడనాన్ని వినియోగించి నీళ్లు నింపడం వల్ల మైక్రోప్లాస్టిక్ కణాలు ఏర్పడుతున్నాయని పరిశోధకులు అభిప్రాయపడుతున్నారు. అలాగే ఒకసారికి మాత్రమే వినియోగించే (సింగిల్ యూజ్) ప్లాస్టిక్ నీళ్ల సీసా కన్నా పునర్వినియోగం అయ్యే (రీయూజబుల్) ప్లాస్టిక్ నీళ్ల సీసాల వల్ల ఎక్కువ మైక్రోప్లాస్టిక్ కణాలు విడుదల అవుతున్నాయని పరిశోధనలో తేలింది.

ఎలాంటి ముప్పు పొంచి ఉంది?
మానవ శరీరంలో 1.5 మైక్రోమీటర్ల కన్నా చిన్న పరిమాణంలో ఉండే మైక్రోప్లాస్టిక్ కణాలు పేగు గోడల గుండా వెళ్లి కాలేయం, ఇతర భాగాల ద్వారా శరీరంలో కలిసిపోతాయి. ఇవి ఊపిరితిత్తుల వాపునకు, క్యాన్సర్ కు కారణం అవుతున్నాయి. ప్లాస్టిసైజర్లు, స్టెబిలైజర్లు, వర్ణద్రవ్యాలు వంటి వాటితో తయారయ్యే ప్లాస్టిక్ నీళ్ల సీసాల నుంచి వచ్చే మైక్రోప్లాస్టిక్స్ రక్తం గుండా ప్రయాణిస్తాయి.

ముప్పును ఎలా నివారించవచ్చు:
మానవ శరీరాల మీద దుష్ప్రభావాలు చూపిస్తున్న మైక్రోప్లాస్టిక్ కణాల నుంచి ముప్పును తట్టుకోవాలంటే వీలైనంత వరకు ప్లాస్టిక్ నీళ్ల బాటిళ్లను వినియోగం తగ్గించడం. దీంతో పాటు బాటిల్​ మూతను మూయడం, తెరవడం లాంటివి ఎక్కువగా చేయకూడదు. అలాగే ఒకసారి మాత్రమే వినియోగించే ప్లాస్టిక్​ను వాడాలి. పునర్వినియోగ ప్లాస్టిక్ సీసాలకు దూరంగా ఉండాలి. అలాగే వేడి, సూర్యరశ్మికి గురికాకుండా ఉండటానికి ప్లాస్టిక్ నీళ్ల సీసాలను చల్లటి, పొడి ప్రదేశంలో నిల్వ చేయడం మంచిది.

For All Latest Updates

TAGGED:

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.