which dal is good for blood sugar patients : షుగర్ వ్యాధి నిశ్శబ్దంగా శరీరంలో చేరి.. జీవితాంతం ట్రావెల్ చేస్తుంది. ఈ వ్యాధి ఒక్కసారి వచ్చిందంటే.. నియంత్రించడం చాలా కష్టం. దేశంలో ఇప్పుడు చాలా మంది ఈ సమస్యతో బాధపడుతున్నారు. పూర్తిగా 30 ఏళ్లు నిండని వారు కూడా ఈ వ్యాధి బారిన పడుతున్నారు. ఈ వ్యాధితో బాధపడుతున్న వారు.. పౌష్టికాహారం తీసుకుంటూ షుగర్‌ను అదుపులో ఉంచుకోవడమే మంచి చికిత్స అని నిపుణులు చెబుతున్నారు. సరైన సమయంలో ఆహారం తీసుకుంటూ ఉండడం వల్ల మెరుగైన ఫలితాలు ఉంటాయని నిపుణులు చెబుతున్నారు. మరి.. షుగర్ వ్యాధి ఉన్న వారు ఏ పప్పులను తీసుకోవాలి ? ఏది తీసుకోవడం వల్ల షుగర్ లెవల్స్ కంట్రోల్లో ఉంటాయి? అనే సందేహాలు చాలా మందికి కలుగుతుంటాయి. దీనిపై నిపుణులు ఏమంటున్నారో ఈ కథనంలో తెలుసుకుందాం.
హై కొలెస్ట్రాల్ భయపెడుతోందా? - ఉదయాన్నే ఇవి తినండి - లేదంటే అంతే!
పీచు పదార్థాలను తీసుకోవాలి..
చక్కెర వ్యాధితో బాధపడుతున్న వారు.. ఫైబర్, ప్రొటీన్లు, యాంటీ ఆక్సిడెంట్లు అధికంగా ఉండే ఆహారాన్ని తీసుకోవాలని నిపుణులు చెబుతున్నారు. బీన్స్, గింజలు, విత్తనాలు, చేపలు, చికెన్, కోడి గుడ్లు తినడం మంచిదని సూచిస్తున్నారు. బ్లాక్ వీట్, బార్లీ, ఓట్స్, క్వినోవా, రాగి వంటి తృణధాన్యాలను తీసుకోవాలని సూచిస్తున్నారు. ఇంకా.. ఆహారంలో బచ్చలికూర, పాలకూర వంటివి చేర్చుకోవడం మంచిదని అంటున్నారు.
ఇలా తినాలి :
- ఉదయం తీసుకునే బ్రేక్ ఫాస్ట్‌లో ఉప్మా, బోండా, వడ, పూరి లాంటి వాటికి దూరంగా ఉండాలి.
- వీటికి బదులుగా ఎక్కువగా ఫైబర్ ఉండే.. ఓట్స్, క్వినో వా దలియా ఉప్మా తీసుకోవాలి.
- తరువాత 11 గంటలకు ఏదో ఒక పండును తీసుకోవాలి.
- విటమిన్ సి ఎక్కువగా ఉండే పండ్లను తీసుకుంటే మంచిది.
- మధ్యాహ్న భోజనంలోకి అన్నం తక్కువగా తీసుకుని, కర్రీ ఎక్కువగా తినాలి.
- ఈ కర్రీల్లో పప్పులను తీసుకోవచ్చు.
- అయితే షుగర్ పేషెంట్స్ గ్లైసెమిక్ ఇండెక్స్ తక్కువగా ఉన్న పప్పులను తీసుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు.
ఈ పప్పుల్లో ఏది బెటర్?
చాలా ఇళ్లలో కందిపప్పుతోపాటు మరో రెండు రకాల పప్పులను వండుతుంటారు. అవి పెసర పప్పు, ఎర్రపప్పు. ఈ రెండింటిలో పెసర పప్పులో ఎక్కువగా గ్లైసెమిక్ ఇండెక్స్ ఎక్కువగా ఉంటుంది. ఎర్రపప్పులో దీని శాతం కాస్త తక్కువగా ఉంటుంది. కాబట్టి.. గ్లైసెమిక్ ఇండెక్స్ తక్కువగా ఉండే ఎర్రపప్పును తీసుకోవడం మంచిదని నిపుణులు సూచిస్తున్నారు.