sex after an abortion: భాగస్వామితో రతిలో పాల్గొనాలకునే వారికి అనేక సందేహాలు వస్తుంటాయి. ముఖ్యంగా అబార్షన్ అయిన మహిళలు ఈ విషయంలో ఎక్కువ మదన పడుతూ ఉంటారు. ఎన్ని రోజులు తరువాత రతిలో పాల్గొనవచ్చు. దీని వల్ల ఏమైనా వైరల్ వ్యాధులు వస్తాయా? అన్న అనుమానాలు వారికి కలుగుతుంటాయి. అలాంటి వాటి గురించి నిపుణులు ఏమంటున్నారో తెలుసుకుందాం..
అబార్షన్ అయిన మహిళలు 10వ రోజు నుంచే సెక్స్‌లో పాల్గొనవచ్చని నిపుణులు చెబుతున్నారు. ఇన్ఫెక్షన్స్ బారిన పడకుండా అబార్షన్ తరువాత యాంటి బయాటిక్ మందులు వాడుకోవడం మంచిదని సూచిస్తున్నారు. అలాగే అబార్షన్ తరువాత వెంటనే మరల గర్భం దాల్చడం అంత మంచిది కాదంటున్నారు. కొన్నాళ్లు వరకు గర్భం దాల్చకపోవడమే బెటర్ అంటున్నారు. డాక్టర్లు సలహాలు తీసుకోవడం మేలని చెబుతున్నారు.
పెళ్లి అయిన వెంటనే కొందరు ప్రెగ్నెన్సీ అవుతారు. వాళ్లకి అప్పుడే పిల్లలు ఇష్టం లేక అబార్షన్ చేయించుకోవాలనుకుంటారు. అలా చేయడం వల్ల భవిష్యత్‌లో ఇబ్బందులు రావచ్చని చెబుతున్నారు నిపుణులు. అబార్షన్ చేయించుకోవడం శ్రేయస్కరం కాదంటున్నారు. ఎందుకంటే అబార్షన్ వల్ల కొందరిలో ట్యూబల్ బ్లాక్ ఫంగస్ వచ్చే అవకాశముందని తెలిపారు. అందుకే ప్రెగ్నెన్సీ వద్దునుకునేవారు ముందునుంచే కండోమ్, పిల్స్‌ను వాడకోమని సలహా ఇస్తున్నారు. ట్యూబల్ బ్లాక్ వలన కొన్ని సార్లు జీవితాంతం పిల్లలు గర్బం రాకపోవచ్చని హెచ్చరిస్తున్నారు.
- " class="align-text-top noRightClick twitterSection" data="">
ఇవీ చదవండి: జ్వరంగా ఉన్నప్పుడు రతిలో పాల్గొంటే నరాల బలహీనత వస్తుందా?