ETV Bharat / sukhibhava

ఈజీగా బరువు తగ్గాలా? ఇంటర్మిటెంట్​ ఫాస్టింగ్​ ట్రై చేయండి!

author img

By

Published : Jan 1, 2023, 7:17 AM IST

సాధారణంగా బరువు తగ్గాలనుకునే వారు తినడం మానేస్తారు లేదా తెగ వర్కవుట్స్​ చేస్తుంటారు. అయితే ఇవేవీ చేయకుండానే బరువు తగ్గే టెక్నిక్​ ఒకటి ఇప్పుడు బాగా ప్రాచుర్యంలోకి వచ్చింది. ఇంటర్మిటెంట్​ ఫాస్టింగ్​గా ఫేమస్​ అయిన ఈ పద్ధతి గురించి ఓసారి తెలుసుకుందాం.

What is intermittent fasting and its benifits
intermittent fasting

ఇంటర్మిటెంట్​ ఫాస్టింగ్

ఇంటర్మిటెంట్ ఫాస్టింగ్​.. ఇటీవల బాగా ప్రాచుర్యంలోకి వచ్చింది. ఇది గుండె ఆరోగ్యాన్ని కాపాడుతునే షుగర్​ రోగులకు ఉపయోగపడుతుంది. అయితే ఇది కొన్ని వందల ఏళ్లుగా మన పూర్వీకులు అలవరుచుకున్న నియమావళి. పూర్వం పెద్దలు అనారోగ్యంతో బాధపడుతున్న సమయంలో లంకణం అనే ఉపవాస పద్ధతిని అనుసరించేవారు. లంకణం అంటే భోజనం మానేయడం. ఆ సమయంలో భోజనం మానేయడమనేది కూడా ఓ ఔషధంగా పరిగణించేవారు. అనారోగ్యంగా ఉన్న సమయంలో ఆహారం తక్కువగా తీసుకునేవారు. తిన్న ఆహారంలో మసాలాలు లేకుండా చూసుకునేవారు. ఇలా చేస్తే తమ ఆరోగ్యం కుదుటపడుతుందని వారి విశ్వాసం. ఈ విధానాన్నే ఇప్పుడు ఇంటర్మిటెంట్​ ఫాస్టింగ్​గా పిలుస్తున్నారు.

ఇంటర్మిటెంట్​ ఫాస్టింగ్ అంటే నియమిత సమయం వరకు ఆహారం తినకుండా ఉండటం. రెండు భోజనాల మధ్య గ్యాప్​ ఇవ్వడమే ఈ ఫాస్టింగ్​ ముఖ్య ఉద్దేశం. ఉదాహరణకు ఒకవేళ ఎవరైనా మధ్యాహ్నం 12 గంటలకు తింటే.. మళ్లీ ఎనిమిది గంటల విరామం తీసుకుని రాత్రి ఎనిమిది 8 గంటలకు తినాలి. అలా మరుసటి రోజు ఉదయం వరకు ఎటువంటి ఆహారం తీసుకోకుండా తిరిగి ఆ రోజు మధ్యహ్నం తీసుకుంటే ఇంటర్మిటెంట్​ ఫాస్టింగ్​లో ఓ లైఫ్​ సైకిల్​ ముగుస్తుంది.

వెయిట్​ లాస్​కు ఉపయోగ పడే విధానాల్లో బాగా ప్రాచుర్యం పొందిన ఈ ప్రక్రియను డైట్​ అనడం కంటే మన జీవన శైలిలో ఒక భాగంగా పరిగణించాలని నిపుణులు అంటున్నారు. ఎందుకంటే ఈ విధనాంలో ఎటువంటి ఆహారపు నియమాలను పాటించాల్సిన అవసరం లేదు. కేవలం రోజువారీ ఆహారపు అలవాట్లతో పాటు దాన్ని తీసుకునే సమయాన్ని మాత్రమే ఈ ఇంటర్మిటెంట్​ డైట్​లో పరిగణిస్తారు.

  • సూమారు 8 గంటల గ్యాప్​తో ఏదైనా ఆహారాన్ని తీసుకునే విధానమే ఇంటర్మిటెంట్​ ఫాస్టింగ్​. అయితే ఈ ఎనిమిది గంటలను తమ వ్యక్తిగత సౌలభ్యాల బట్టి ఎవరికి వారు మార్చుకోవచ్చని నిపుణులు అంటున్నారు.
  • ఒక వేళ ఉదయం పూట తినకుండా ఉండగలరని భావిస్తే ఈజీగా బ్రేక్​ఫాస్ట్​ను స్కిప్​ చేయచ్చు. దాని బదులు ఒకేసారి లంచ్​లో తినొచ్చు. ఆ తర్వాత రాత్రి 7 గంటలకు కానీ ఎనిమిది గంటలకు కానీ డిన్నర్​ చేసి మళ్లీ 16 గంటల గ్యాప్​ తీసుకుని తిరిగి భోజనం చేయవచ్చు.
  • దీనిలో మనం చేసేదల్లా ఒక్క మీల్స్​ స్కిప్​ చేయడం మాత్రమే. అలా అని మిగతా రెండు మీల్స్​లో ఎక్కువ క్యాలరీల గల ఆహారాన్ని తీసుకుంటే అప్పుడు ఈ ఇంటర్మిటెంట్ ఫాస్టింగ్​ వెయిట్​ లాస్​కు ఏమాత్రం ఉపయోగపడదని నిపుణులు అంటున్నారు.
  • ఈ విధానాన్ని కూడా ఒక్కొక్కరు ఒక్కో విధంగా ఫాలో అవుతుంటారు. ఒకరేమో రోజూ పాటిస్తే.. మరొకరు వారానికి ఒకసారి పాటిస్తారు. అయితే చెక్కర స్థాయిని తగ్గించి కొలెస్ట్రాల్​కు చెక్​ పెట్టడమే ఈ ఫాస్టింగ్​ ముఖ్య ఉద్దేశం.
  • మనం తినే ఆహార సమయాన్ని రోజులో కొన్ని గంటలకు పరిమితం చేయడం.. మిగిలిన సమయం ఎటువంటి ఆహారం తీసుకోకుండా ఉండటం వల్ల శరీరంలో ఇన్సులిన్​ ఉత్పత్తి చేయాల్సిన అవసరం గణనీయంగా తగ్గిపోతుంది. అంతే కాకుండా శరీరానికి ఎనర్జీ అవసరమైనప్పుడు మనలో ఎప్పటి నుంచో నిల్వ ఉన్న కొవ్వును శరీరం ఉపయోగించుకుంటుంది.

ఆహారం తీసుకోవడానికి కూడా ఓ క్రమశిక్షణ అవసమని నిపుణులు అంటుంటారు. ఇతర డైటింగ్​ విధానం లాగా కొవ్వు పదార్థాలు, కార్బోహైడ్రేట్స్​ తినకూడదని ఈ ఫాస్టింగ్​ విధానం చెప్పదు. ఈ డైట్​లో కేవలం సమయం పాటించడమే మఖ్యం. అయితే జంక్​ ఫుడ్​ జోలికి వెళ్లకుండా ఉండటం మంచిదని చెప్తున్నారు నిపుణులు. మన శరీరంలో ఇన్​ఫ్లెమేటరీ మార్కర్స్​ అనే కొన్ని కెమికల్స్​ దీర్ఘకాలిక సమస్యలకు దారి తీస్తుంటాయి. అవన్నీ ఈ ఫాస్టింగ్​ వల్ల తగ్గుముఖం పడతాయి. దీని వల్ల మధుమేహం, గుండె సంబంధిత రోగాలు​ తగ్గడమే కాకుండా ఆయుష్షు పెరుగుతుంది.

అయితే కొందరు మాత్రం ఈ ఫాస్టింగ్ చేయకుండా ఉండటమే మంచిదని వైద్యులు సూచిస్తున్నారు. గర్భిణీలు, పాలిచ్చే తల్లులు, నెలసరి క్రమంగా రాకుండా ఉండేవారితో పాటు ముందుగానే నెలసరి ఆగిపోయిన వారు, 18-20 సంవత్సరాల మధ్య వయస్సులో ఉన్న యువత.. ఈ రకమైన ఫాస్టింగ్​కు దూరంగా ఉండాలని సిఫార్సు చేస్తున్నారు. రెగ్యులర్​ మీల్స్​తో పాటు ట్యాబ్లెట్స్​ వేసుకునే వారు, దీర్ఘకాలిక మధుమేహం, కడుపులో అల్సర్​​ ఉన్నవారు సైతం ఈ ఇంటర్మిటెంట్ ఫాస్టింగ్​కు నో చెప్పాలని అంటున్నారు.

ఇంటర్మిటెంట్​ ఫాస్టింగ్​ వల్ల లాభాలు..

  • బరువు తగ్గడం
  • శరీరంలో కొవ్వు శాతం తగ్గి గుండె సమస్యలకు చెక్​
  • మెదడు చురుకుదనంతో పాటు ఆయుష్షు పెరుగుదల

గుడ్​ రిజల్ట్స్​ కోసం ఇవి ఫాలో అయిపోండి మరి..

  • పోషకాలు పుష్కలంగా ఉన్న ఆహారానికి ఎస్​
  • చేప నూనె, గింజలు, విత్తనాలు ధాన్యాలను తీసుకోవాలి
  • కొవ్వు శాతం తక్కువగా ఉండే ప్రొటీన్స్​ను ఆహారంలో భాగం చేసుకోవాలి
  • ఫైబర్​ ఎక్కువగా ఉండే పళ్లు కూరగాయలును తినాలి
  • విటమిన్స్​, మినరల్స్​ ఎక్కువగా ఉన్న ఆహారాన్ని తినడాన్ని అలవరుచుకోవాలి

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.