ETV Bharat / sukhibhava

నెల రోజులు గుడ్లు తినడం మానేస్తే - మీ బాడీలో జరిగేది ఇదే!

author img

By ETV Bharat Telugu Team

Published : Jan 15, 2024, 3:31 PM IST

Health Benefits of Eggs : ఎగ్స్​.. ప్రొటీన్​ ఫుడ్​. అందుకే చాలా మంది రోజుకు ఒక గుడ్డు అయినా తమ ఆహారంలో భాగం చేసుకుంటారు. అయితే.. మీకు ఎప్పుడైనా గుడ్డు తినకపోతే బాడీలో ఏం జరుగుతుంది..? అనే డౌట్​ వచ్చిందా.. దానికి సమాధానం ఇప్పుడు చూద్దాం.. నెలరోజులు గుడ్లు తినకపోతే మన శరీరంలో జరిగే మార్పులు ఏంటో ఈ స్టోరీలో చూద్దాం..

Eggs
Eggs

Eggs Health Benefits in Telugu : శరీరానికి అన్ని అవసరమైన పోషకాలు అందించేందుకు తక్కువ ధరలో లభించే పదార్థం ఏందంటే.. అందరికీ టక్కును గుర్తొచ్చేవి గుడ్లు. ఇవి తినడానికి రుచికమైనవి మాత్రమే కాకుండా మన బాడీలోని అవయవాల పనితీరుకు కావాల్సినన్ని పోషకాలను కలిగి ఉంటాయి. దీంతో చాలా మంది తమ బ్రేక్​ఫాస్ట్​లో ఎగ్స్​ని భాగం చేసుకుంటారు. అయితే ప్రస్తుత రోజుల్లో మారిన జీవనశైలి, ఆహారపు అలవాట్ల దృష్ట్యా ఎక్కువ మంది శాకాహారాన్ని ఎంచుకుంటున్నారు.

ఈ క్రమంలో గుడ్లతో సహా ఎలాంటి మాంసం లేదా పాల ఉత్పత్తులను తీసుకోవడం లేదు. మరి మీరు కూడా మీ డైట్ నుంచి గుడ్ల(Eggs)ను తొలగించినట్లయితే శరీరంలో ఏమి జరుగుతుందో తెలుసుకోవడం చాలా ముఖ్యమంటున్నారు ఆరోగ్య నిపుణులు. ఈ క్రమంలోనే మీరు ఒక నెల రోజులు గుడ్లు తినకపోతే అది శరీరంపై ఎలాంటి ప్రభావం చూపుతుందో వారు వివరించారు. ఆ వివరాలు ఈ స్టోరీలో తెలుసుకుందాం..

నెలరోజుల పాటు గుడ్లు తినడం బంద్​ చేస్తే ఏం జరుగుతుందంటే.. మీరు నెలరోజుల పాటు గుడ్లు తినకుండా ఉంటే.. అది శరీరంపై అనేక ప్రభావాలను చూపుతుంది. ముందుగా.. ఈ అలవాటు పోషకాల లోపానికి దారితీస్తుంది. ఎందుకంటే గుడ్లు.. ప్రొటీన్స్, అమైనో ఆమ్లాలు, విటమిన్లు (B12, D, కోలిన్), ఖనిజాలు (సెలీనియం, ఫాస్పరస్​) కలిగి ఉంటాయి. కాబట్టి వీటిని తీసుకోకపోతే అది కండరాల నిర్వహణ, మెదడు ఆరోగ్యం, రోగనిరోధక వ్యవస్థపై చాలా ప్రభావం చూపుతుంది. అలాగే కోడిగుడ్డులో సెలీనియం ఉంటుంది. ఇది థైరాయిడ్ హార్మోన్ల ఉత్పత్తిలో కీలక పాత్ర పోషిస్తుంది. కోడిగుడ్డు తినకపోతే థైరాయిడ్ హార్మోన్ల ఉత్పత్తి తగ్గుతుంది. తద్వారా ఇది థైరాయిడ్ సమస్యలకు దారితీస్తుంది. ఒకవేళ మీ డైట్​లో గుడ్లు చేర్చుకున్నారంటే పొందే ప్రయోజనాలను కూడా నిపుణులు వివరించారు. అవేంటంటే..

ఆహారంలో గుడ్లను చేర్చుకోవడం వల్ల కలిగే ప్రయోజనాలు..

పోషకాలు పుష్కలం : గుడ్లు అత్యంత పోషకమైన ఆహారాలలో ఒకటి. ఇవి మీకు అవసరమైన ప్రతి పోషకాన్ని కొంతమేర కలిగి ఉంటాయి. ముఖ్యంగా ఫాస్పరస్, విటమిన్ ఎ, బి, డి, ఇ తో పాటు కొన్ని ఖనిజాలు ఎగ్స్​లో ఉంటాయి.

ప్రొటీన్లు సమృద్ధిగా ఉంటాయి : ఒక గుడ్డు 6 గ్రాముల ప్రొటీన్‌ను అందిస్తుంది. ఇది మీ శరీరానికి రోజూ అవసరమైన అన్ని అమైనో ఆమ్లాలను కలిగి ఉన్నందున అధిక-నాణ్యత ప్రొటీన్‌గా చెప్పుకోవచ్చంటున్నారు నిపుణులు.

కంటి ఆరోగ్యానికి మంచిది : గుడ్లలో లుటిన్, జియాక్సంతిన్ అనే యాంటీఆక్సిడెంట్లు ఉంటాయి. ఫలితంగా ఇవి కంటిశుక్లం, మచ్చల క్షీణత ప్రమాదాన్ని తగ్గిస్తాయి.

గుండె ఆరోగ్యానికి మంచిది : ఎగ్స్ తినడం వల్ల గుండె జబ్బులు, స్ట్రోక్ ప్రమాదాన్ని తగ్గించవచ్చు. ఎందుకంటే వాటిలో ఒమేగా 3-ఫ్యాటీ యాసిడ్‌లు ఉంటాయి. ఇవి గుండెకు మేలు చేస్తాయి. అలాగే వీటిలో బీటైన్, లిన్ ఉంటాయి. ఇవి కూడా గుండె ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తాయి.

బరువు తగ్గడంలో సహాయపడవచ్చు : గుడ్లలో ప్రొటీన్లు అధికంగా ఉంటాయి. కాబట్టి వీటిని తింటే ఎక్కువసేపు కడుపు నిండిన అనుభూతిని కలిగిస్తాయి. మొత్తం మీద ఇది తక్కువ కేలరీలు తినడానికి దారితీస్తుంది.

Eggs For Weight Loss : వేగంగా బరువు తగ్గాలా?.. కోడి గుడ్లను ఇలా తిని చూడండి!

ఎగ్స్​ ప్లేస్​లో ఇవి తీసుకోవాలి: అయితే, ఒక నెల పాటు గుడ్లు తినకుండా ఉండాలనే నిర్ణయం వారి వారి వ్యక్తిగత పరిస్థితులు, ప్రాధాన్యతలు, ఆహార అవసరాలపై ఆధారపడి ఉంటుందని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. ఒకవేళ గుడ్లను తినకుండా ఉండాలంటే వాటి స్థానంలో ఇతర ఆహార పదార్థాలను మీ డైట్​లో తప్పనిసరిగా చేర్చుకోవాలంటున్నారు. ముఖ్యంగా మీరు గుడ్లు తినకపోతే.. మాంసం, చేపలు, బీన్స్, కాయధాన్యాలు, టోఫు, గింజలు వంటి ఇతర వనరుల నుంచి ప్రొటీన్స్ పొందవచ్చు. ఎందుకంటే శరీరానికి సమతుల్య, ఆరోగ్యకరమైన ఆహారాన్ని అందించడం ముఖ్యం.

ఉదాహరణకు విటమిన్ డి.. పాలు, సాల్మన్ వంటి కొవ్వు చేపలలో లభిస్తుంది. విటమిన్ B12.. మాంసం, చేపలు, పాల ఉత్పత్తులలో లభిస్తుంది. ఐరన్.. మాంసం, పౌల్ట్రీ, చేపలు, బీన్స్, బలవర్థకమైన తృణధాన్యాలలో అధికంగా ఉంటుంది. ఇలా మీరు డైట్​లో ఎగ్స్​ తీసుకోకపోతే దాని ద్వారా పొందే పోషకాలను ఇలా పొందడం ద్వారా శరీరంలో జరిగే ప్రభావాలను తగ్గించుకునే అవకాశం ఉందంటున్నారు నిపుణులు.

బ్రేక్ ఫాస్ట్​లో గుడ్డు తింటున్నారా? ఏం జరుగుతుందో తెలుసా?

Health Benefits Of Eggs in Telugu : కోడిగుడ్డు.. అందానికీ, ఆరోగ్యానికీ వెరీ గుడ్డు!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.