కోడి గుడ్డుతో ఎన్నో ప్రయోజనాలు. దీనిని పలు రకాలుగా వండుకొని తినొచ్చు. అన్ని వయసుల వారికి సంపూర్ణ ఆహారంగా పనికొచ్చే గుడ్డు ప్రాముఖ్యత అంతా ఇంతా కాదు. పసిపిల్లాల మొదలుకొని పండు ముసలి వరకు చాలా ఇష్టంగా తినే వాటిలో గుడ్డు టాప్‌లో ఉంటుంది. ఎదిగే పిల్లలకు ప్రోటీన్లు అందిస్తుంది. పోషకాహార లేమితో బాధపడే వారు రోజుకు ఓ గుడ్డు తినడం ద్వారా ఆ సమస్యను అధిగమించొచ్చు. మాంసకృతులు పుష్కలంగా ఉంటాయి. కండ పుష్ఠికి, కండరాల నిర్మాణానికి ఎంతో మేలు చేస్తుంది. తేలికగా జీర్ణం అవడమే కాకుండా.. దీనిని తీసుకొన్న కొంతసేపటి వరకు ఆకలి వేయదు.
- " class="align-text-top noRightClick twitterSection" data="">
ఉపయోగాలు..
- చీప్ అండ్ బెస్ట్‌లో ప్రోటీన్లు కావాలంటే కేవలం గుడ్డుతోనే సాధ్యం అని చెప్పొచ్చు. ఒక గుడ్డులో 7 నుంచి 8 గ్రాముల ప్రోటీన్ ఉంటుంది. క్యాలరీలు 70 నుంచి 80 వరకు, కొవ్వులు కేవలం 5గ్రాములు, కొలెస్ట్రాల్ 190 గ్రాములు, నీరు 87శాతం శరీరానికి అందుతాయి.
- గుడ్డులోని పచ్చసొనలో విటమిన్లు ఉంటాయి. విటమిన్ డీ, ఏ, ఈ, కే లు ఉంటాయి. అంతేగాకుండా దీనిలో ఐరన్, జింక్, సెలీనియం, కాపర్ లాంటి ఖనిజాలు కూడా ఉంటాయి. యాంటీ ఆక్సిడెంట్స్ కూడా అదనంగా లభిస్తాయి.
- గుడ్డును తీసుకోవడం వల్ల కంటి సమస్యలు దూరం అవుతాయి.
- అన్ని వయసుల వారు రోజుకు కనీసం ఒక గుడ్డును తీసుకోవడం మంచిదే. కానీ కొలెస్ట్రాల్ సమస్యలు ఉన్న వారు మాత్రం ఒకటి కంటే ఎక్కువ తీసుకోకపోవడం ఉత్తమం.
- గట్టి పెంకుతో ఉంటుంది కాబట్టి కోడి గుడ్డు అంత సులభంగా కలుషితం కాదు. ఉడికించి తినడం వల్ల కల్తీ నూనెల బెడద కూడా ఉండదు. బయోలాజికల్ వ్యాల్యూ 100 శాతంగా చెప్పుకోవచ్చు.
- ఆరునెలలు దాటిన తరువాత చిన్నారులకు గుడ్డు పెట్టడం అలవాటు చేస్తే.. వారికి పౌష్ఠిక ఆహారం అందుతుంది. కానీ ఈ సమయంలో వారికి కేవలం ఉడకబెట్టిన గుడ్డు మాత్రమే ఇవ్వాలి.
- 40 ఏళ్లు దాటిన వారు ఆరోగ్య పరీక్ష అనంతరం డాక్టర్ సూచన మేరకు మాత్రమే తీసుకోవాలి.
- గుడ్డులో ఉండే క్యాల్షియం శరీరంలోని జుట్టు, చర్మం, గోర్లు లాంటివి ఆరోగ్యంగా ఉండేందుకు సహకరిస్తుంది.
- విటమిన్ డీ లోపంతో బాధపడే వారు.. రోజుకు ఒక గుడ్డు తీసుకోవడం వల్ల ఆ సమస్య నుంచి విముక్తి పొందవచ్చు.
- డైట్లో ఉండే వారికి గుడ్డు ఎంతో మేలు చేస్తుంది. వ్యాయామం అనంతరం దీనిని తీసుకుంటే శక్తిని తిరిగి పుంజుకునేందుకు దీనిలోని అమైనో ఆమ్లాలు ఉపయోగపడుతాయి.
- కాలేయ జబ్బు, ధమనులు గట్టి పడటం, నాడీ సమస్యలు రాకుండా ఉండేందుకు గుడ్డు ఎంతో ఉపయుక్తంగా ఉంటుంది.
- రొమ్ము క్యాన్సర్ రాకుండా కాపాడే శక్తి గుడ్డుకు ఉందని వివిధ పరిశోధనల్లో తేలింది.
- గుడ్డుతో గుండెకు ఎంతో ప్రయోజనం. గుండె నొప్పి వచ్చే ప్రమాదాన్ని నివారించవచ్చని వైద్యులు చెప్తున్నారు. అందుకే రోజుకు ఓ గుడ్డు తినడం అలవాటు చేసుకోవడం మంచిది.
ఇదీ చూడండి: Weight Loss Tips: బెల్టు పెట్టుకుంటే పొట్ట తగ్గుతుందా?