ETV Bharat / sukhibhava

Weight Loss Tips At Home : హెల్దీగా బరువు తగ్గాలా?.. ఈ వంటింటి చిట్కాలు పాటిస్తే చాలు! - ఇంటి చిట్కాలతో వెయిట్​ లాస్​కు చెక్​

Weight Loss Tips At Home : అధిక బరువుతో బాధపడే వాళ్లు, బరువు తగ్గాలని అనుకునే వాళ్లు రకరకాల డైట్లు పాటించడం, మందులు వాడుతుండడం లాంటివి చేస్తుంటారు. కానీ అలాంటి అవసరం ఏ మాత్రం లేదు. మన ఇంట్లోనే శరీర బరువును తగ్గించే అనేక పదార్థాలు ఉన్నాయి. అవేంటో ఇప్పుడు చూద్దాం.

Home Tips To Reduce Weight
Home Tips To Reduce Weight
author img

By ETV Bharat Telugu Team

Published : Aug 26, 2023, 8:17 AM IST

Updated : Aug 26, 2023, 6:43 PM IST

Weight Loss Tips At Home : బరువు తగ్గాలని చాలా మంది అనుకుంటారు. ఇందు కోసం వ్యాయామం చేస్తారు. ఆహార నియమాలు పాటిస్తారు. ఏం తినాలి? ఎప్పుడు తినాలి? ఎంత తినాలి? అని డైట్‌ ఛార్ట్‌ పెట్టుకుని ఆచరిస్తారు. అయితే, ఇంటి చిట్కాలతోనూ బరువు తగ్గవచ్చని నిపుణులు చెబుతున్నారు. అందుకోసం పలు పద్ధతుల్ని కూాడా సూచిస్తున్నారు. అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం.

Tips To Lose Weight : బరువు తగ్గాలని చాలా మంది సంకల్పిస్తారు. ఆచరణలో కొందరు సాధిస్తారు. మరికొందరు మధ్యలోనే నిరాశ చెందుతారు. బరువు తగ్గే కసరత్తులు చేస్తూనే.. ఇంటి చిట్కాలు కూడా పాటిస్తే సత్ఫలితాలు ఉంటాయని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. ఇందుకోసం ఐదు రకాల సూత్రాలు బోధిస్తున్నారు. అవేంటో ఇప్పుడు చూద్దాం. ఇవి పాటిస్తే అధిక బరువు తగ్గడం( Home Remedies To Lose Weight Fast) తో పాటు పొట్ట చుట్టూ పేరుకున్న కొవ్వును కరిగించవచ్చని సూచిస్తున్నారు.

నిమ్మ రసంలో తేనె వేసుకుని తాగితే!
ఆరోగ్యానికి నిమ్మ రసం చాలా మేలు చేస్తుంది. శరీరంలో మలినాల తొలగింపుతో పాటు జీవక్రియల మెరుగుదల, బరువు తగ్గుదలకు దోహద పడుతుంది. రోజూ ఉదయం లెమన్‌ వాటర్‌ తాగితే శరీరంలో మలినాలు పేరుకుపోకుండా చేయవచ్చు. ఆరోగ్యకరమైన జీర్ణక్రియ వ్యవస్థను పెంచుకోవచ్చు. నిమ్మ రసంలో తేనె కలుపుకుని తాగితే మరిన్ని ప్రయోజనాలు పొందవచ్చు.

దాల్చిన చెక్క, హనీ టీ!
Honey Cinnamon For Weight Loss : దాల్చిన చెక్క అంటే ప్రతీ ఒక్కరికీ తెలిసిందే. ప్రతీ వంటింట్లో దాల్చిన చెక్క ఉంటుంది. దీనికి బరువును తగ్గించే గుణం ఉంటుంది. దాల్చిన చెక్క, తేనె కలిపిన టీ తాగితే యాంటీబ్యాక్టీరియల్‌, యాంటీ మైక్రోబియల్‌గా పనిచేస్తుంది. ఆరోగ్యకరమైన జీవనశైలి, వ్యాయామంతో పాటు దాల్చినచెక్క, తేనె మిశ్రమం తాగితే అద్భుతమైన ఫలితాలు లభిస్తాయి. దీని వల్ల శరీరంలో వేడి పెరిగి, కేలరీలు కరుగుతాయని 2012లో చేసిన ఓ అధ్యయనంలో వెల్లడైంది.

పచ్చి వెల్లుల్లి!
Garlic For Weight Loss : వంటింట్లోనే లభించే పచ్చి వెల్లుల్లి కూడా బరువు తగ్గేందుకు అద్భుతంగా పని చేస్తుంది. వంటల్లో రుచి, సువాసన కోసం వెల్లుల్లిని ఉపయోగిస్తాం. ఇది మంచి ఔషధం. ఇందులో చాలా విటమిన్స్‌, మినరల్స్‌, ఫైబర్‌, ప్రోటీన్‌, మాంగనీస్‌, యాంటీ ఆక్సిడెంట్స్‌ ఉంటాయి. పచ్చి వెల్లుల్ని తినడం వల్ల పొట్ట చుట్టూ పేరుకున్న కొవ్వు కరుగుతుంది.

పెరుగు!
Curd Lose Weight : బరువు తగ్గేందుకు చాలా ఉపయోగపడే మరో పదార్థం పెరుగు. ఆహారంలో తరచుగా పెరుగు తీసుకోవడం వల్ల జీర్ణ క్రియలు మెరుగుపడుతాయని, పొట్ట చుట్టూ పేరుకున్న కొవ్వు కరుగుతుందని చాలా మంది వైద్య నిపుణులు చెబుతున్నారు. ఇదే విషయాన్ని పలు అధ్యయనాలు నిరూపించాయి. పెరుగులో విటమిన్స్‌, మినరల్స్‌, ఫైబర్‌, ప్రోటీన్‌, ప్రోబయోటిక్స్‌ ఉంటాయి. ఇవి పేగుల్ని ఆరోగ్యంగా ఉంచుతాయి.

చియా గింజలు!
Chia Seeds For Weight Loss : చియా గింజలు కూడా బరువు తగ్గించేందుకు కీలకంగా పని చేస్తాయి. వీటిల్లో విటమిన్స్‌, మినరల్స్‌, ఫైబర్‌, పొటాషియం ఉంటాయి. ఇవి శరీర పనితీరును మెరుగుపరుస్తాయి. ఒక ఔన్స్‌ ఈ చియా గింజల్లో 39 శాతం వరకు ఫైబర్​ ఉంటుంది. చియా గింజల్లోని ఈ ఫైబర్‌ నీటిని పీల్చుకుంటుంది. అలాగే చియా గింజలు కొంచెం తిన్నా కూాడా కడుపు నిండిన భావన కలుగుతుంది. అందువల్ల తక్కువ ఆహారం తీసుకుంటారు. ఫలితంగా ఆరోగ్యకరమైన బరువును మెయింటెయిన్‌ చేయవచ్చు.

Last Updated : Aug 26, 2023, 6:43 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.