ETV Bharat / sukhibhava

వేడి నీళ్లతో స్నానం చేస్తే ఎన్ని లాభాలో.. షుగర్ వ్యాధి సైతం దూరం! - వేడి నీళ్ల స్నానంతో హెల్త్​ బెనిఫిట్స్​

మనం రోజువారీ తప్పక చేయాల్సిన పనుల్లో స్నానం ఒకటి. మనిషి ఆరోగ్యంలో ఇది కీలకపాత్ర పోషిస్తుంది. ఎంత శుభ్రంగా ఉంటే మన ఆరోగ్యం అంత బాగుంటుందని పెద్దలు అంటుంటారు. స్నానం చేయడం వల్ల ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయని వైద్యనిపుణులు కూడా చెబుతున్నారు. ఆ లాభాలేంటో తెలుసుకుందామా?

Various Health Benefits Of Taking Hot Shower Bath Daily
వామ్మో.. వేడి నీళ్లతో స్నానం చేస్తే ఇన్ని ఆరోగ్య లాభాలా..!
author img

By

Published : Apr 27, 2023, 7:10 AM IST

కాలాలను బట్టి స్నానం చేసే విధానాలు మారుతుంటాయి. ఎండాకాలంలో చాలా మంది చన్నీళ్లతో స్నానం చేస్తుంటారు. అదే వర్షాకాలం, చలికాలంలోనైతే గోరు వెచ్చటి లేదా వేడి నీళ్లతో స్నానం చేస్తుంటారు. కొందరు రోజుకు రెండు సార్లు స్నానం చేస్తే.. మరికొందరు మాత్రం ఒక్కసారి చేయడానికి కూడా ఇష్టపడరు. దీనికి బద్దకం ప్రధాన కారణం అని చెప్పొచ్చు. కానీ నిపుణులు మాత్రం రోజూ స్నానం చేయాలని సూచిస్తున్నారు.

ముఖ్యంగా వేడినీటితో స్నానం చేయడం వల్ల ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయని నిపుణులు చెబుతున్నారు. దీని వల్ల రోజు మొత్తం పనిభారంతో అలసిపోయిన శరీరానికి, మనసుకు ఉపశమనంతో పాటు సాంత్వన చేకూరుతుంది. భారత్ లాంటి తేమ, ఉక్కపోత ఎక్కువగా ఉండే దేశాల్లో వేడినీళ్లతో స్నానం చేయడం మంచిదని నిపుణులు సూచిస్తున్నారు. దీని వల్ల కండరాలు ఉత్తేజితమై యాక్టివ్​గా ఫీలవుతారు. దీంతో పడుకున్న వెంటనే నిద్ర పట్టేస్తుంది.

వేన్నీళ్లతో స్నానం చేస్తే కలిగే ఆరోగ్య ప్రయోజనాలు ఇవే..
ఒత్తిళ్లు దూరం!
వేన్నీళ్లతో స్నానం చేయడం వల్ల శరీరంలో రక్తప్రసరణ మెరుగుపడుతుంది. శరీరంలో చేతుల నుంచి పాదాల వరకు రక్త ప్రసరణ సులువుగా అయ్యేలా చేస్తుంది. దీని వల్ల శరీరానికి ఉపశమనం దక్కుతుంది. అలాగే రక్తపోటు స్థాయులు తక్కువై మీరు మరింత మెరుగ్గా అనుభూతి చెందుతారు. వేడి నీళ్ల వల్ల రక్త ప్రసరణ వేగం పెరుగుతుంది. దీని వల్ల కండరాలు దృఢంగా తయారవుతాయి. రోజువారీ ఒత్తిళ్ల నుంచి బయటపడేందుకు వేడినీళ్లలో తులసి లేదా నీలగిరి తైలాలను కలిపి స్నానం చేస్తే మంచి ఫలితాలు ఉంటాయని నిపుణులు సూచిస్తున్నారు.

నిద్రలేమికి చెక్!
నిద్రలేమితో చాలా మంది ఇబ్బంది పడుతుంటారు. అలాంటి వాళ్లు రాత్రి పడుకోవడానికి 90 నిమిషాల ముందు వేడినీళ్లతో స్నానం చేయాలి. దీని వల్ల శరీరం చల్లగా మారి.. చర్మాన్ని వెచ్చగా ఉంచుతుంది. వేడినీళ్లతో స్నానం చేయడం వల్ల ఒత్తిళ్లు దూరమవతాయి. మెదడులో రక్తప్రసరణ మెరుగుపడుతుంది. అయితే ఈ నీళ్ల ఉష్ణోగ్రత 104 నుంచి 108 డిగ్రీల ఫారెన్​హీట్ మధ్య ఉండేలా చూసుకోవాలి.

చికాకులు దూరం!
చికాకుగా అనిపిస్తే వెంటనే వేడినీళ్లతో స్నానం చేయండి. ఇది చాలా ఉపయోగపడుతుంది. వేన్నీళ్లతో స్నానం చేయడం వల్ల చర్మ సౌందర్యాన్ని కాపాడుకోవచ్చు. ఇది చర్మాన్ని మృదువుగా ఉంచడంలో సాయపడుతుంది. వాపు లాంటి వాటిని తగ్గించడంలోనూ వేడినీళ్లు బాగా దోహదపడతాయి. అయితే నీళ్లు మరీ వేడిగా ఉండకుండా చూసుకోవాలి. మీ శరీరానికి తగ్గట్లు నీళ్లు ఎంత వేడిగా ఉండాలో చూసుకోండి.

షుగర్​ ముప్పును తగ్గిస్తుంది!
వేడినీళ్లతో తరచూ స్నానం చేయడం టైప్-2 మధుమేహం లాంటి వ్యాధుల ముప్పును తగ్గిస్తుందని పలు పరిశోధనల్లో తేలింది. వేడి నీళ్లతో స్నానం చేయడం వల్ల రక్త ప్రసరణ వేగం పెరగడమే కాకుండా కండరాల్లోకి గ్లూకోజ్ ఎక్కువగా చేరుతుంది. దీని వల్ల రక్తంలోని గ్లూకోజ్ స్థాయులు తగ్గుతాయి.

ముక్కు దిబ్బడను తరిమికొట్టండి!
వాతావరణ మార్పుల వల్ల జలుబు, దగ్గు లాంటివి రావడం సహజం. అయితే వేడినీళ్ల స్నానంతో వీటిని తరిమికొట్టొచ్చు. వేడినీళ్లతో స్నానం చేయడం వల్ల ముక్కు దిబ్బడ, తలనొప్పి వంటి వాటి బారి నుంచి బయటపడొచ్చు. అంతేగాక గోరువెచ్చటి నీటితో స్నానం చేస్తే శరీరంలోని వేడి తగ్గి జ్వరం నుంచి కూడా ఉపశమనం పొందొచ్చు.

అలసట నుంచి ఉపశమనం!
చల్లటి నీళ్లతో స్నానం చేయడం కంటే వేడి నీళ్లతో స్నానం చేస్తే మరిన్ని ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. వేడినీళ్లతో స్నానం చేయడం వల్ల రోజువారీ ఒత్తిళ్లు, అలసట నుంచి ఉపశమనం లభిస్తుంది. అయితే నీళ్లు వేడి చేసేందుకు వాడే హీటర్, గీజర్ లాంటివి కొనుగోలు చేసే సమయాల్లో నాణ్యత ప్రమాణాలు పాటించాలి. మార్కెట్​లో దొరికే మంచి బ్రాండెడ్ సంస్థ ఉత్పత్తులను మాత్రమే తీసుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు. విద్యుత్తును తక్కువగా తీసుకునే పరికరాల వల్ల కరెంట్ బిల్లు ఆదా కావడమే కాకుండా పునరుత్పాదకత వల్ల భూగ్రహానికి ఎంతోకొంత మేలు చేసినవారవుతారు.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.