'హలో డాక్టర్. నా వయసు 27. నాకు పెళ్త్లె మూడేళ్త్లెంది. పిల్లల కోసం ప్రయత్నిస్తున్నాం. కానీ నాకు వెజైనా ఎక్కువ సమయం పాటు పొడిగా ఉండడంతో లైంగిక చర్యలో పాల్గొన్నప్పుడు చాలా నొప్పిగా అనిపిస్తుంది. డాక్టర్‌ను సంప్రదిస్తే ముందు ఒత్తిడి నుంచి బయటపడమని సలహా ఇచ్చారు. అయినప్పటికీ నేను సెక్స్‌ని ఆస్వాదించలేకపోతున్నాను. నేను త్వరగా గర్భం ధరించే మార్గాలేంటో సూచించగలరు.' - ఓ సోదరి
జవాబు: లైంగిక చర్యలో పాల్గొన్నప్పుడు పొడిగా, నొప్పిగా ఉంటుందని అంటుంటారు. దీనికి మానసిక సంసిద్ధత లేకపోవడం కూడా కారణం కావచ్చు. మీరు లైంగిక చర్యకు మానసికంగా సిద్ధంగా లేనప్పుడు ఆ సమయంలో ల్యూబ్రికేషన్‌కి అవసరమయ్యే స్రావాలు జననాంగాల వద్ద ఉత్పత్తి కావు. అందుకే మీకు కలయిక సమయంలో జననాంగ ప్రాంతం పొడిగా ఉన్నట్లు అనిపిస్తోంది. కాబట్టి లైంగిక చర్య కోసం మీరు మానసికంగా సంసిద్ధం కావడానికి ప్రయత్నించాలి. అయినప్పటికీ కలయిక సమయంలో పొడిగా, నొప్పిగా ఉంటే ఇతర ఇన్ఫెక్షన్స్ ఏమైనా ఉన్నాయేమో ఒకసారి పరీక్షలు చేయించుకోవాలి. అలాగే లైంగిక చర్య సవ్యంగా పూర్తయినప్పటికీ గర్భం ధరించడంలో సఫలం కాకపోతే అందుకు ఇతరత్రా కారణాలు ఏమైనా ఉన్నాయేమో తెలుసుకోవడానికి మిగిలిన పరీక్షలు కూడా చేయించుకోవాలి.
- డాక్టర్ వై. సవితాదేవి, గైనకాలజిస్ట్
ఇదీ చదవండి: Teen Pregnancy: ఈ విషయాలు మీకు తెలుసా?