సంతానం ఎందరో దంపతుల కల. అయితే ఒకరిద్దరు పుట్టిన తర్వాత.. ఇక చాలని కొందరు భావిస్తారు. భవిష్యత్లో గర్భం దాల్చకుండా ఉండాలని ప్రయత్నిస్తారు. ఇందుకోసం శస్త్రచికిత్స కూడా చేయించుకుంటారు. ముఖ్యంగా మహిళలే ఎక్కువగా ఈ ఆపరేషన్ను(ట్యూబెక్టమీ, tubectomy operation) చేయించుకుంటారు. అయితే పురుషులు కూడా దీన్ని(వ్యాసక్టమీ,vasectomy operation) చేయించుకోవచ్చు. పిల్లలు పుట్టకుండా ఉండటానికి ఈ శస్త్రచికిత్స మగవాళ్లు చేయించుకుంటే మంచిదని వైద్యనిపుణులు అంటున్నారు.
మహిళలకు ఇబ్బందులు
ట్యూబెక్టమీ.. మహిళల పొట్ట లోపలకు వెళ్లి చేయాలి. దీని వల్ల ఒక్కోసారి కడుపులో ఇన్ఫెక్షన్(tubectomy problems) రావచ్చు. కొంతమందిలో ఈ ఇబ్బందులు తలెత్తుతాయి. పురుషుల్లో ఇలాంటి ఇబ్బందులు రావు.
పురుషులు చేసుకునే ఆపరేషన్ చాలా సులువైనది. ఏమాత్రం ఇబ్బంది లేకుండా చేసుకోవచ్చు. అయితే శస్త్రచికిత్స చేయించుకుంటే తాము సెక్స్ చేయడానికి పనికిరామని.. నరాల బలహీనత వస్తుందని.. శారీరకంగా బలహీన పడతామని పురుషులు భయపడుతుంటారు.ఆపరేషన్ చేయించుకోవడానికి ముందుకు రారు. అయితే వ్యాసక్టమీ వల్ల ఎలాంటి సమస్యలు రావని వైద్యులు చెబుతున్నారు. అలాగే శస్త్రచికిత్స అనంతరం కూడా ఎప్పట్లాగే శృంగారంలో పాల్గొనవచ్చని అంటున్నారు.
అందువల్ల అపోహాలను పక్కనపెట్టి పురుషులు ఆపరేషన్ చేయించుకోవడమే మేలంటున్నారు నిపుణులు.
- " class="align-text-top noRightClick twitterSection" data="">
ఇదీ చూడండి: కాలిన గాయాల మచ్చలు పోవాలంటే.. ఇలా చేయండి!