ETV Bharat / sukhibhava

సంప్రదాయ చికిత్సతో మధుమేహానికి కళ్లెం

షుగర్, డయాబెటిస్, మధుమేహం... పేర్లు ఏవైనా కావొచ్చు. కానీ సమస్య మాత్రం ఒక్కటే. అది రక్తంలో గ్లూకోజు శాతం అదుపు తప్పడం. ఈ జీవితకాలపు జబ్బును అదుపులో ఉంచుకోవడమేగానీ ఇప్పటి వరకు కచ్చితమైన చికిత్స అంటూ ఏదీ లేదు. మధుమేహం అదుపు తప్పితే అది కళ్ల నుంచి కాళ్ల వరకు మన శరీరంలోని ప్రతి అవయవాన్నీ దెబ్బ తీస్తుంది. ఈ తీపి జబ్బును అదుపులో ఉంచడానికి ఆహారం, అలవాట్లు, జీవనశైలి... ఇలా అన్ని విషయాల్లోనూ ప్రత్యేకంగా జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుందని చెబుతారు రామోజీ ఫిల్మ్ సిటీలోని సుఖీభవ వెల్ నెస్ కేంద్రానికి చెందిన నిపుణులు.

traditional treatment for diabetes at sukhibava wellness center
సంప్రదాయ చికిత్సతో మధుమేహానికి కళ్లెం వేద్దాం
author img

By

Published : Oct 18, 2020, 5:02 PM IST

సంప్రదాయ చికిత్సతో మధుమేహానికి కళ్లెం

తీపి అనే ప్రతి మాటలో కొన్ని సందర్భాల్లో తీపికబురు ఉండకపోవచ్చు. దానికి ఉదాహరణ మధుమేహం. పేరుకే షుగర్ అనేది తీపి జబ్బు. అది తెచ్చిపెట్టే ఇబ్బందులు అన్నీ ఇన్నీ కావు. ఒక్కసారి ఈ మధుమేహం బారిన పడితే ఇక ఒళ్లంతా గుల్లైపోతుంది. ముందుగా ఒంట్లో షుగర్ నిల్వలు పేరుకుపోవడం వల్ల రక్తనాళాల్లో సమస్యలు మొదలవుతాయి. ఒంట్లో షుగర్ ఉంటుంది కానీ, అది మాత్రం శరీర భాగాలకు అందదు. దీంతో విపరీతమైన నీరసం. రెండోది షుగర్ నిల్వల వల్ల రకరకాల ఇన్ఫెక్షన్లు వచ్చిపడతాయి. ఏదైనా ఇన్ఫెక్షన్ వస్తే ఇక అది మానడం చాలా ఇబ్బందైపోతుంది.

జాగ్రత్త, నియంత్రణ..

మెల్లగా షుగర్ కారణంగా హైబీపీ రావడం, రక్తనాళాల్లో కొలెస్ట్రాల్ పెరగడం, వీటి కారణంగా గుండెపోటు, పక్షవాతం లాంటివి రావడం సంభవిస్తుంది. ఇల్లంతా ఒళ్లంతా ఆపాదమస్తకాన్ని షుగర్ జబ్బులమయంగా మార్చేస్తుంది. అందుకే మొదటగా షుగర్ బారిన పడకుండా జాగ్రత్తపడాలి. ఒకవేళ షుగర్ ఉంటే నియంత్రణలో ఉంచుకోవాలి. మధుమేహానికి సంప్రదాయ చికిత్సను అందుబాటులోకి తెచ్చింది రామోజీ ఫిలింసిటీలోని సుఖీభవ వెల్ నెస్ సెంటర్.

క్రమశిక్షణే ప్రధానం..

మన జీవనశైలిని, దిన చర్యను ఎంత క్రమశిక్షణగా పెట్టుకుంటామనే దానిపైనే మన ఆరోగ్యం ఆధారపడుతుంది. మధుమేహం విషయంలోనూ ఇదే వర్తిస్తుంది. ఆహారం, వ్యాయామాం, నిద్ర, ఒత్తిళ్లు వీటన్నింటినీ చక్కగా ఉంచుకుంటే మధుమేహాన్ని రాకుండా చూసుకోవచ్చు. ఒకవేళ ఇప్పటికే షుగర్ ఉంటే కూడా మన సంప్రదాయ చికిత్సా పద్ధతుల్ని వాడి దానిని చక్కగా నియంత్రణలో పెట్టుకోవచ్చు.

"డయాబెటిస్ అన్నది జబ్బు కాదు అదొక సమస్య మాత్రమే. ఈ సమస్య అనేది మన జీవనశైలి వల్ల వస్తుంది. మన జీవనశైలి అంటే మనం ఏ సమయానికి ఏం తింటున్నాం, ఎంత నీళ్లు తుగుతున్నాం, ఎంత నిద్రపోతున్నాం, మన పనివేళలు ఎలా ఉంటున్నాయి, మన ఒత్తిళ్లు ఎలా ఉంటున్నాయి, మనం మరీ ఎక్కువగా తింటున్నామా.. ఇవన్నీ మన ఎండోక్రైన్ వ్యవస్థ మీద ప్రభావం చూపిస్తాయి. దీంతో చిన్న వయసులోనే డయాబెటిస్ వస్తోంది. మన పొట్టను రెండో మెదడుగా చెప్పుకుంటాం. మనం ఏం తింటున్నాం, ఎలా తింటున్నాం అనేది పొట్టమీద ప్రభావం చూపిస్తుంది. పొట్టను 7 భాగాలుగా విభజించుకుంటాం. మనం ఏం తింటామో అదే అన్ని వ్యవస్థలుగా రూపుదిద్దుకుంటుంది.

మనం ఈ మధ్య జంక్ ఫుడ్, స్వీట్లు ఎక్కువగా తింటున్నాం. పనుల్లో ఉన్నప్పుడు టీ, కాఫీలు ఎక్కువగా తాగేస్తాం. దీంతో సమయానికి తినడం మానేస్తాం. దీంతో మన ఒంట్లో గ్లూకోజ్ లెవెల్స్ బాగా ఒడుదొడుకులకు గురవుతాయి. దీంతో ఎండోక్రైన్ సిస్టం ఎక్కువగా పని చేయాల్సి వస్తుంది. ఇదెలా ఉంటుందంటే, ఏదైనా మెషీన్ తో ఇష్టమొచ్చినట్టు, ఓ పద్ధతీ పాడూ లేకుండా పనిచేస్తే అది ఏదో రోజు పనిచేయడం ఆపేస్తుంది. మన శరీరంలో కూడా అదే జరుగుతంది. అందుకే డయాబెటిస్ వస్తుంది. మానసికంగా కూడా బాగా ఒత్తిడిలో ఉంటే కూడా శరీరం, ఎండోక్రైన్ సిస్టం బాగా రియాక్ట్ అవుతుంది. వీటన్నింటిని దృష్టిలో పెట్టుకుని ఇక్కడ ఆహార ప్రణాళికను రూపొందిస్తాం. ఎక్కువగా ఆహారంపైనే మేం దృష్టి సారిస్తాం. ప్రధానంగా వెజిటబుల్ డైట్ ఇస్తాం. ఇందులో గ్రీన్ వెజిటబుల్స్ , గ్రీన్ జ్యూసెస్, పళ్లు, సలాడ్స్, కొన్ని గింజలు, మొలకలు ఇస్తాం. దీంతో పూర్తిగా షుగర్ ను కంట్రోల్ చేస్తాం. అసలు మందులనేవే వాడకుండా షుగర్లను తగ్గిస్తాం. దీంతో పాటు యోగాలో కపాలభాతి ప్రాణాయామం కూడా చేయిస్తాం. దీనివల్ల కూడా మంచి ఉపయోగముంటుంది. కొన్ని ఆసనాలు, ఆహార క్రమశిక్షణ పాటిస్తే మధుమేహానికి మందుల అసవరం అసలు ఉండనే ఉండదు. "

--డాక్టర్ అర్చన, సుఖీభవ వెల్​నెస్​ సెంటర్​ డైరెక్టర్

ఇలా చెక్​ పెట్టొచ్చు!

ప్రస్తుతానికి షుగర్​ను మేనేజ్ చేసుకోవడం తప్ప పూర్తిగా నయం చేసుకోవడం అన్నది కష్టసాధ్యమైన వ్యవహారం. అందుకే షుగర్ బిళ్లలు జీవితాంతం వాడడమో, ఇన్సులిన్ ఇంజెక్షన్లు వేసుకుంటూ మధుమేహాన్ని నియంత్రణలో పెట్టుకోవడం చేస్తుంటారు. అయితే, మితంగా సమతులాహారం తీసుకోవడం, నిత్యం ఓ గంట వ్యాయామం చేయడం, నిద్ర ఎనిమిది గంటల పాటు ఉండేలా చూసుకోవడం, ఒత్తిళ్లను దూరం చేసే జీవనశైలిని అనుసరించడం లాంటివి చేస్తే షుగర్ రాకుండా చూసుకోవచ్చు. ఆయుర్వేదం, యోగా, ప్రకృతి వైద్యం లాంటి వాటి సమ్మిశ్రమ విధానంతో... మధుమేహాన్ని నివారించుకోవచ్చు. ఇప్పటికే వచ్చిన షుగర్లను నియంత్రణలో పెట్టుకోవచ్చు.

traditional treatment for diabetes at sukhibava wellness center
సంప్రదాయ చికిత్సతో మధుమేహానికి కళ్లెం వేద్దాం

ఇదీ చూడండి:సంప్రదాయ చికిత్సతో స్థూలకాయానికి చెక్​

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.