ETV Bharat / sukhibhava

కాబోయే అమ్మలూ.. మీకోసమే ఈ ముందు జాగ్రత్తలు! - etv bharat health

అమ్మతనం.. ప్రతి ఆడపిల్ల కోరుకునే వరం. కానీ, ఆ వరాన్ని కాలం ప్రసాదించినప్పుడు కాక, మనకు అనుకూల సమయంలో పొందాలని చాలామంది మగువలు ప్రయత్నిస్తున్నారు. కెరీర్, బిజీ లైఫ్ ఇలా కారణమేదైనా సరే.. పెళ్లయ్యాక గర్భం దాల్చడానికీ ఓ సమయం కేటాయిస్తున్నారు. దాన్నే ప్రెగ్నెన్నీ ప్లానింగ్ అంటున్నారు. మరి, తల్లి అవ్వాలని నిర్ణయించుకున్నాక ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటే బిడ్డకూ, అమ్మకూ క్షేమం? తెలుసుకుందాం రండి...

tips-for-pregnancy-planning-for-to-be-moms
కాబోయే అమ్మలూ.. మీకోసమే ఈ ముందు జాగ్రత్తలు!
author img

By

Published : Sep 9, 2020, 10:31 AM IST

Updated : Sep 9, 2020, 2:54 PM IST

గర్భం దాల్చాలనుకున్నప్పుడు... తీసుకునే కొన్ని ముందుజాగ్రత్తలు పుట్టబోయే పాపాయికే కాదు... తల్లికీ ఎంతో మేలుచేస్తాయి. తొమ్మిదినెలల్లో ఎదురయ్యే సమస్యల్ని అదుపులో ఉంచుతాయి. మరి ఆ ముందు జాగ్రత్తలేంటో మనమూ తెలుసుకుందామా!

  • నెలసరి క్రమం తప్పకుండా వస్తుందా... గతంలో వాడిన గర్భనిరోధకాలు, సంతానసాఫల్య సామర్థ్యం పెంచేందుకు తీసుకున్న చికిత్సలు కూడా వైద్యులతో చెప్పాలి.
  • లైంగిక వ్యాధులు ఉంటే వాటి చికిత్సల వివరాలు చెప్పాలి. అబార్షన్లు కావడం, పుట్టిన వెంటనే పాపాయి చనిపోవడం వంటివీ చెప్పాలి. ఈ సమస్యలు తెలుసుకోవడానికి వైద్యులు ముందుగానే యాంటీబాడీలు, క్రోమోజోములకు సంబంధించిన పరీక్షలు సూచిస్తారు.
  • మనకు ఉండే కొన్నిరకాల అనారోగ్య సమస్యలు, వాడే మందులు, జీవనశైలి వంటివన్నీ గర్భధారణపై ప్రభావం చూపుతాయి. అవే కాబోయే తల్లీబిడ్డలకు ప్రమాదకరం కావొచ్చు. అందుకే గర్భం దాల్చాలనే ఆలోచన వచ్చినప్పటి నుంచీ జాగ్రత్తలు తీసుకోవాలి. దీన్నే ‘ప్రీకన్సెప్షనల్‌ ఇవాల్యుయేషన్‌ అండ్‌ కౌన్సెలింగ్‌’ అంటారు. వాస్తవానికి గర్భం దాల్చడానికి కనీసం మూడునెలల ముందుగానే వైద్యులతో చర్చించాలి. అలా చర్చించాల్సిన విషయం కాబోయే తల్లికి ఉండే ఆరోగ్య సమస్యలు, వాటి పరిష్కారాలు. అవెలాంటివంటే..
  • సాధారణ ఆరోగ్య సమస్యలు: అధికబరువు, అధికరక్తపోటు, మధుమేహం, గుండె, ఊపిరితిత్తులు, మూత్రపిండాల సమస్యల వంటివి ఉంటే గర్భందాల్చక ముందే వాటిని అదుపులో ఉంచుకోవాలి.
  • మన భారతీయ స్త్రీలకు బీఎంఐ (బాడీమాస్‌ ఇండెక్స్‌) 18-23 వరకూ ఉండాలి. బరువు ఎక్కువగా ఉన్నా...తక్కువగా ఉన్నా కూడా తల్లీబిడ్డలిద్దరికీ హానే. కాబట్టి తగిన జాగ్రత్తలు తీసుకోవాలి. ఒకవేళ అధికబరువుంటే కనీసం పదిశాతం తగ్గించుకోవాలి.
  • అధిక రక్తపోటు ఉన్నవారు వాడే అన్నిరకాల మందులు గర్భస్థశిశువుకు సురక్షితం కాదు. ముఖ్యంగా బీటాబ్లాకర్లు గర్భిణులు వాడకూడదు. అందుకే ఏం మందులు వాడుతున్నారో ముందుగానే డాక్టర్లకు చెప్పాలి. మధుమేహం ఉన్నప్పుడు గర్భం దాల్చడానికి ముందే దాన్ని అదుపులోకి తెచ్చుకోవాలి. దీని నియంత్రణ కోసం వాడే కొన్నిరకాల మందులు గర్భిణులకు పడకపోవచ్చు.
  • హిమోగ్లోబిన్‌ ఏ1 సి స్థాయులు ఆరు లోపల ఉన్నాయా లేదా అనేది గమనించుకోవాలి. లేకపోతే ఆస్థాయికి చేరుకున్నాకే గర్భం దాల్చాలి.
  • మూర్ఛతో బాధపడే మహిళలు తమకున్న సమస్యతో పాటు వాడే మందుల వివరాలు తప్పనిసరిగా గర్భందాల్చడానికి ముందే డాక్టర్‌తో చెప్పాలి. లేదంటే బిడ్డకు అవకరాలు కలిగే అవకాశాలు ఎక్కువ. అప్పుడే న్యూరాలజిస్టును సంప్రదిస్తే సురక్షితమైన మందులు సూచిస్తారు.
  • గతంలో ఎప్పుడైనా గుండె, అండాశయాలు, గర్భాశయం వంటివాటికి జరిగిన శస్త్రచికిత్సలు, వాడే మందుల వివరాలను డాక్టర్లకు ముందే తెలియజేయాలి. గర్భాశయంలో గడ్డలు ఉండి వాటిని తొలగిస్తే...కాన్పు సమయంలో, నొప్పులు వచ్చేటప్పుడు జాగ్రత్తలు తీసుకోవలసి ఉంటుంది.
    tips-for-pregnancy-planning-for-to-be-moms
    కాబోయే అమ్మలూ.. మీకోసమే ఈ ముందు జాగ్రత్తలు!
  • నెత్తురు గడ్డకట్టే వ్యాధితో బాధపడే స్త్రీలు వారు వాడే మందుల గురించి కూడా డాక్టర్లకు ముందే చెప్పాలి. నెత్తురు పల్చబడేందుకు సూచించే మాత్రల్లో వార్ఫారిన్‌ ఉంటే గనుక గర్భం దాల్చాలనుకున్నప్పుడు వాటిని మానేయాల్సి ఉంటుంది. లేదంటే బిడ్డకు అవకరాలు రావొచ్చని అధ్యయనాలు చెబుతున్నాయి.
  • ఈ రోజుల్లో రీనల్‌ ట్రాన్స్‌ప్లాంట్‌ అయిన స్త్రీలు కూడా గర్భం దాల్చడానికి వెసులుబాటు ఉంది. అయితే రీనల్‌ ట్రాన్స్‌ప్లాంట్‌ రిజెక్ట్‌ కాకుండా ఇమ్యునో సప్లిమెంట్లు వాడతారు. ఇవి గర్భం దాల్చాలనుకునేవారికి హాని చేయొచ్చు. కాబట్టి నెఫ్రాలజిస్టుతో చర్చించి సురక్షితమైన మందులు వాడాల్సి ఉంటుంది.
  • రొమ్ముక్యాన్సర్‌ బారిన పడిన మహిళలు గర్భం దాల్చాలనుకుంటే... కీమోథెరపీ, రేడియేషన్‌ తీసుకుంటున్న విషయాన్ని గైనకాలజిస్టుతో వివరంగా చెప్పాలి. కీమో తరువాత వెంటనే గర్భం వస్తే బిడ్డ అవకరాలతో పుట్టే అవకాశాలు ఎక్కువ.
  • మొటిమలు కోసం వాడే మందుల్లో ఐసోట్రెటినాయిన్‌ ఉంటుంది. ఇది పుట్టబోయే బిడ్డకు హానికరం. గర్భం దాల్చాలనే ప్రణాళికకు ముందే ఆ మందులు వాడటం మానేయాలి.

వయసు-కుటుంబ చరిత్ర

  • మరీ 20ఏళ్లలోపు, 35 సంవత్సరాలు దాటాక గర్భం దాల్చడం సమస్యే. గర్భవతిగా తొమ్మిది నెలల్లోనే కాదు, కాన్పు సమయంలో కూడా సమస్యలు ఎదురుకావచ్చు. 35 ఏళ్లు దాటిన వారిలో అధికరక్తపోటు, జస్టేషనల్‌ డయాబెటీస్‌, ప్రీ ఎక్లాంప్సియా, పాపాయి దక్కకపోవడం, అవకరాలు వంటి సమస్యలు ఉండొచ్చు. వయసు బాగా తక్కువగా ఉన్న స్త్రీలకయితే నెలలు నిండకుండానే కాన్పు కావడం, తక్కువ బరువుతో పిల్లలు పుట్టడం, రక్తహీనత వంటి సమస్యలు ఎదురవుతాయి. ఇటువంటి స్త్రీలు ముందుగా డాక్టర్‌తో మాట్లాడితే జాగ్రత్తలు సూచిస్తారు.
  • కుటుంబంలో ఎవరికైనా కంజెనిటిల్‌ అబ్‌నార్మాలటీస్‌, పుట్టుకతో వచ్చిన లోపాలు, డౌన్స్‌సిండ్రోమ్‌ వంటి క్రోమోజోముల లోపాలు, బుద్ధిమాంద్యం, ఎదుగుల లోపాలు వంటివి డాక్టర్‌కి ముందుగానే చెప్పాలి. వంశపారంపర్యంగా వచ్చే కొన్ని జబ్బులు, హిమోగ్లోబినోపతీ, ఊపిరితిత్తులకు సంబంధించిన వ్యాధులు, గుండెలో లోపాలు, హిమోఫీలియా వంటివన్నీ ముందే చర్చిస్తే అవసరమైన పరీక్షలు నిర్వహిస్తారు. గర్భం దాల్చకముందే వీటిపై ఓ అంచనా వస్తే.. పుట్టబోయే బిడ్డకు ఏవైనా జబ్బులు ఉన్నాయో లేదో తెలుసుకుని నియంత్రించే అవకాశం ఉంటుంది. డౌన్స్‌ సిండ్రోమ్‌ని ముందుగానే గుర్తించొచ్చు. ఇలాంటివి కుటుంబంలో ఉంటే అమ్నియోసింటసిస్‌ (ఉమ్మనీటి పరీక్ష), ఎన్‌ఐపీటీతో పాటు మరికొన్ని ప్రత్యేక పరీక్షలు చేస్తారు.

గర్భందాల్చక ముందు పరీక్షలు

  • హిమోగ్లోబిన్‌ శాతం
  • బ్లడ్‌గ్రూప్‌, ఆర్‌హెచ్‌ శాతం
  • మూత్రంలో ప్రొటీన్‌
  • మధుమేహానికి సంబంధించిన పరీక్ష
  • పాప్‌స్మియర్‌
  • లైంగిక వ్యాధులు గుర్తించేందుకు గొనోకాకస్‌, క్లమీడియా, సిఫిలిస్‌, హెచ్‌ఐవీ వంటివి పరీక్షలు
  • హెచ్‌బీఎస్‌ఏజీ, రుబెల్లా... ఐజీజీ వంటి పరీక్షలు తప్పనిసరిగా చేయించుకోవాలి. కొన్ని ప్రత్యేక పరిస్థితుల్లో అవసరం అనుకుంటే మరికొన్ని పరీక్షలూ తప్పవు.

ఇదీ చదవండి: పట్టులాంటి కురులకు.. బంగారం లాంటి చిట్కాలు!

Last Updated : Sep 9, 2020, 2:54 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.