కలకాలం కలిసి ఉండాల్సిన వాళ్లు... ప్రతి చిన్న విషయానికిీ పోట్లాడుకుంటుంటే జీవితం నిస్సారంగా మారుతుంది. అలకలు కాస్తా అనుబంధాన్ని బీటలు వారుస్తాయి...
- దాంపత్య బంధంలో ఇద్దరి మధ్య భేదాభిప్రాయాలు సహజం. ఆ సమస్యను అక్కడివరకే చూడాలి. భవిష్యత్తులో మరో ఇబ్బంది ఎదురైనప్పుడు దాన్ని దీనితో జత కలపొద్దు. పాతవాటిని తవ్వుకోవడం వల్ల ఇద్దరి మనసుల్లోనూ ప్రతికూల భావాలు పెరిగిపోతాయి.
- తరచూ వాదనలు పెరిగిపోతుంటే... సమస్య ఎక్కడ ఉందో మూలం తెలుసుకోండి. తామే నెగ్గాలనుకోవడం వల్లే ఇలాంటి పరిస్థితి ఎదురవుతుంది. వీలైతే ఎదుటివారి కోణంలో ఆలోచించడానికి ప్రయత్నించండి. దాంతో మీ ఆలోచనల్లో మార్పు రావొచ్చు.
- ఎప్పుడూ ఎదుటివారిలో లోపాలను మాత్రమే చూడొద్దు వారిలోని సానుకూలతలను గుర్తించగలిగితే ... మీపై ఆ ప్రభావం పడుతుంది. చిన్న విషయమే అయినా థ్యాంక్స్ చెప్పడం, చిన్న చిన్న పొరపాట్లు చేసినప్పుడు సారీ చెప్పడం లాంటివి మీ అనుబంధాన్ని మరింతంగా పెంచుతాయి.
ఇవీ చూడండి: కరోనాపై ఇంటి నుంచే యుద్ధం.. హోం ఐసోలేషన్‌లోనే వైద్య సేవలు..