అధిక బరువును తగ్గించుకుని, స్లిమ్‌గా మారాలని అందరూ అనుకుంటారు. అందుకే వ్యాయామాలు చేస్తుంటారు. కానీ, ఎంత వ్యాయామాలు చేసినా ఒక్కోసారి బరువులో ఏ మార్పు కనిపించదు. దానికి కారణం.. మనం వేళ కాని వేళల్లో కసరత్తుల చేయడమే! మనం ఏ సమయంలో వ్యాయామం చేస్తున్నామనేది.. కూడా బరువు తగ్గడంలో కీలక పాత్ర పోషిస్తుంది. మధ్యాహ్నం మూడు గంటల తర్వాత వ్యాయమం చేసే వారితో పోలిస్తే.. అంతకుముందు వ్యాయామం చేస్తేనే బరువు తగ్గడంలో మంచి ఫలితాలు వస్తాయని తేలింది. 'ఇంటర్నేషనల్ జర్నీ ఆఫ్ ఒబెసిటీ' అనే హెల్త్ వెబ్సైట్ నిర్వహించిన అధ్యయనంలో ఈ విషయాలు వెల్లడయ్యాయి.
కసరత్తులు చేసే సమయం, బరవు తగ్గడానికి మధ్య సంబంధాన్ని కనుగొనే ఉద్దేశంతో 200 మందిపై ఈ అధ్యయనం చేశారు. వ్యాయామం చేసే సమయం ఆధారంగా వీరందరినీ గ్రూపులుగా విభజించి, 10 నెలల వ్యవధిలో ఈ పరిశోధన చేశారు. ఇందులో పాల్గొన్న సభ్యులంతా వారంలో ఐదు రోజులు వ్యాయామం చేసి, ప్రతీ సెషన్లో 400 నుంచి 600 క్యాలరీలను కరిగించారు. వారు తీసుకునే ఆహారం, చేసే కసరత్తులను పరిశోధకులు విశ్లేషించి బరువు తగ్గడంలో వ్యాయామం చేసే సమయం కూడా ప్రధాన పాత్ర పోషిస్తుందని తేల్చారు. అయితే ఈ వ్యత్యాసానికి గల కారణమేంటో మాత్రం చెప్పలేదు.
ఇదీ చూడండి:'వారాంత యోధులకూ' ప్రయోజనాలెక్కువే!