These Healthy Habits Increase Lifespan : కొన్ని ఆరోగ్యకరమైన అలవాట్ల ద్వారా మీ జీవితకాలాన్ని(Lifespan) ఏకంగా 24 సంవత్సరాలు పెంచుకోవచ్చని.. ఇటీవల ఓ అధ్యయనంలో తేలింది. ఇందుకోసం 8 అలవాట్లను మీ డైలీ రొటీన్లో భాగం చేసుకోవాలని సూచిస్తున్నారు. ఇంతకీ ఆ అలవాట్లేంటి? అనే వివరాలు ఈ స్టోరీలో తెలుసుకుందాం.
రెగ్యులర్ వ్యాయామం : ఆరోగ్యాన్ని కాపాడుకోవడానికి, దీర్ఘాయువును పెంచుకోవడానికి క్రమం తప్పకుండా శారీరక శ్రమ అవసరం. జాగింగ్, స్విమ్మింగ్ లేదా సైక్లింగ్ వంటి కార్యకలాపాలలో పాల్గొనడం వల్ల మీ కండరాలు, ఎముకలు బలపడటమే కాకుండా గుండె జబ్బులు, మధుమేహం, క్యాన్సర్ వంటి కొన్ని రకాల దీర్ఘకాలిక వ్యాధుల ప్రమాదాన్నీ తగ్గించుకోవచ్చు.
ఉదాహరణకు.. ఉదయాన్నే 30 నిమిషాలు వేగంగా నడవండి. మనస్సు, శరీర వ్యాయామం కోసం స్థానిక యోగా క్లాస్‌లో చేరినా మంచి ప్రయోజనం ఉంటుంది.
సమతుల ఆహారం : పండ్లు, కూరగాయలు, తృణధాన్యాలు, లీన్ ప్రోటీన్లు, ఆరోగ్యకరమైన కొవ్వులు అధికంగా ఉండే సమతుల్య ఆహారం తీసుకోవడం చాలా అవసరం. పోషకాలు అధికంగా ఉండే ఫుడ్ మీ బాడీకి అవసరమైన విటమిన్లు, మినరల్స్, యాంటీఆక్సిడెంట్లను అందించి వ్యాధుల బారిన పడకుండా కాపాడుతుంది.
ఉదాహరణకు.. తృణధాన్యాలు, తాజా పండ్లు, గుడ్లు లేదా పెరుగు వంటి ప్రోటీన్ ఫుడ్స్‌తో కూడిన టిఫిన్స్‌తో మీ రోజును ప్రారంభించండి.
తగినంత నిద్ర : రోజూ తగినంత నిద్ర చాలా ముఖ్యం. ఎందుకంటే సరైన నిద్ర లేకపోతే రోగనిరోధక వ్యవస్థ బలహీనపడటం, దీర్ఘకాలిక వ్యాధుల ప్రమాదానికి దారి తీస్తుంది. కాబట్టి డైలీ సరైన నిద్ర ఉండేలా చూసుకోండి.
ఉదాహరణకు.. పుస్తకాన్ని చదవడం లేదా నిద్రకు ముందు గోరువెచ్చని నీటితో స్నానం చేయడం వంటివి ఫాలో అవ్వడం ద్వారా రోజూ 7-9 గంటల నాణ్యమైన నిద్ర ఉండేలా చూసుకోండి.
స్ట్రెస్ మేనేజ్ మెంట్ : దీర్ఘకాలిక ఒత్తిడి మీ శారీరక, మానసిక ఆరోగ్యాన్ని దెబ్బతీస్తుంది. కాబట్టి ధ్యానం, డీప్ బ్రీతింగ్ వ్యాయామాలు వంటివి మీ ఒత్తిడి స్థాయిలను తగ్గించడంతో పాటు దీర్ఘాయువును ప్రోత్సహించడంలో సహాయపడుతాయి.
ఉదాహరణకు.. మైండ్‌ఫుల్‌నెస్ మెడిటేషన్ కోసం రోజూ కొన్ని నిమిషాలు కేటాయించండి లేదా మీ మనసును శాంతపరచడానికి, ఒత్తిడిని తగ్గించడానికి యోగాను సాధన చేయండి.
సామాజిక సంబంధాలు : బలమైన సామాజిక సంబంధాలను కొనసాగించడం, పెంపొందించుకోవడం వంటివి మీ జీవితకాలాన్ని గణనీయంగా ప్రభావితం చేస్తాయి. బలమైన సామాజిక వ్యవస్థ ఉన్న వ్యక్తులు ఎక్కువ కాలం జీవించగలరని, దీర్ఘకాలిక వ్యాధుల బారిన పడే అవకాశం తక్కువగా ఉంటుందని కొన్ని అధ్యయనాలు చెబుతున్నాయి.
ఉదాహరణకు.. మీ ఇష్టాలకు అనుగుణంగా ఉండే స్థానిక క్లబ్ లేదా కమ్యూనిటీ సమూహంలో చేరండి లేదా పాత స్నేహితులతో మాట్లాడండి.
మీరు ఈ ఆహార పదార్థాలు తింటున్నారా? - మీ పేగుల్లో విషం నింపుతునట్టే!
డ్రగ్స్‌కు దూరంగా ఉండడం : మాదకద్రవ్యాలకు దూరంగా ఉండటం కూడా మీ ఆరోగ్యాన్ని చాలా వరకు సేఫ్‌గా ఉంచుతుంది. అలా ఉన్నప్పుడే మీకు కొత్త వ్యక్తులతో పరిచయాలు ఏర్పడి సమాజంలో కొత్త కొత్త విషయాలు తెలుస్తాయి. ముఖ్యంగా మీ కమ్యూనిటీకి కనెక్ట్ అయి ఉండడానికి మీకు సహాయం చేస్తుంది.
ఉదాహరణకు.. డ్రగ్స్‌కు దూరంగా ఉంటూనే ఇతరులతో కనెక్ట్ అవ్వడానికి సపోర్ట్ గ్రూప్‌లో చేరడం లేదా స్థానిక సంస్థతో స్వచ్ఛందంగా పనిచేయడం స్టార్ట్ చేయాలి.
మద్యం తాగడం తగ్గించుకోవడం : అధిక ఆల్కహాల్ వినియోగం మీ ఆరోగ్యంపై హానికరమైన ప్రభావాలను చూపుతుంది. కాలేయ వ్యాధి, గుండె సంబంధ సమస్యలు, వివిధ రకాల క్యాన్సర్ల ప్రమాదాన్ని పెంచుతుంది. కాబట్టి వీలైనంత వరకు మద్యపానానికి దూరంగా ఉండడం మంచిది.
ఉదాహరణకు.. మిమ్మల్ని మీరు కంట్రోల్లో ఉంచుకుంటూ వీలైనంత వరకు ఆల్కహాల్ తాగడం తగ్గించుకోవాలి. అవసరమైతే మాక్‌టెయిల్‌లు లేదా ఫ్లేవర్డ్ ఫిజీ వాటర్ వంటి ఆల్కహాల్ లేని ప్రత్యామ్నాయాలను ఎంచుకోవడం బెటర్.
ధూమపానానికి దూరంగా : అకాల మరణాలకు ప్రధాన కారణాలలో ధూమపానం ఒకటి. కాబట్టి ధూమపానం మానేయడం అనేది మీ ఆరోగ్యాన్ని గణనీయంగా మెరుగుపరుస్తుంది. అలాగే మీ జీవితకాలాన్ని పెంచుతుంది.
ఉదాహరణకు.. ధూమపానం మానేసి మీ ఆరోగ్యాన్ని మెరుగుపరచుకోవడానికి ఆరోగ్య సంరక్షణ నిపుణుల నుంచి సలహాలు పొందండి లేదా ధూమపాన విరమణ కార్యక్రమాలలో చేరండి.
శరీరంలో చెడు కొలెస్ట్రాల్ తగ్గాలా? పరగడుపున ఈ 'ఐదు' ఆకులు తింటే చాలు!