ETV Bharat / sukhibhava

నెమ్మదిగా తింటే బరువు తగ్గుతారా? - weight loss techniques without exercise

weight loss techniques: అధిక బరువును తగ్గించుకోవడానికి ఈ రోజుల్లో అనేక మార్గాలు అనుసరిస్తున్నారు. కొంత మంది వ్యాయామం చేస్తే మరికొంత మంది డైట్​ చేస్తుంటారు. కానీ డైట్​ పేరుతో ఇష్టమైన ఆహారానికి దూరంగా ఉండటం, శక్తికి మించి వ్యాయామం చేయడం సరైన విధానం కాదు. ఇష్టమైన ఆహారం తింటూనే అధిక బరువును ఎలా తగ్గించుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం..

weight loss technology
బరువు
author img

By

Published : Dec 8, 2021, 7:00 AM IST

Weight loss tips: స్థూలకాయం ప్రస్తుత రోజుల్లో సమస్యగా మారింది. పరిమితికి మించి భోజనం చేయడం, వేళకాని వేళ తినటం, చిరుతిళ్లు ఇందుకు కారణం కావచ్చు. వీటన్నింటితో పాటు మరో కారణం కూడా ఉందని నిపుణులు చెబుతున్నారు. మనసులో కడుపునిండిన భావన కలగకుండా గబగబా తినడం వల్ల అధిక బరువు సమస్య వస్తుందంటున్నారు.

బరువు నియంత్రణకు ఆహార పాత్ర కీలకమైంది. అంతేకాదు. మనసులో కడుపునిండిన భావనతో తినడం బరువును తగ్గిస్తుంది. దీనినే 'మైండ్​ఫుల్ ఈటింగ్'​ అంటారు. అంటే తొందరగా తినకుండా ఆహారపదార్థాల రుచిని ఆస్వాదిస్తూ తినడం అన్నమాట. ఇలా తింటే ఎక్కువ తినాల్సిన అవసరం ఉండదు. ఒకవేళ త్వరగా తినడం వల్ల కడుపునిండిన ఫీలింగ్ కలుగుతుంది కానీ మనసుకు తృప్తి కలగదు. చిన్న భాగాలుగా ఆహారాన్ని తినడం వల్ల మనసుకు కడుపునిండిన భావన కలుగుతుంది. ఫలితంగా ఎక్కువ ఆహారం తీసుకోవాల్సిన అవసరం ఉండదు.

వేగంగా తినేవాళ్లు తప్పకుండా స్థూలకాయం బారిన పడతారని ఇటీవల పలు అధ్యయనాలు వెల్లడించాయి. అయితే.. నచ్చిన ఆహారం తినేప్పుడు గాబరాగా తినేస్తుంటాం. ఇందుకు మనసును నియంత్రణలో ఉంచుకోవాల్సి ఉంటుంది. ఇష్టమైన ఆహారం ఉన్నప్పటికీ తినేప్పుడు కాస్త విరామం ఇస్తూ తినాలి.

  • " class="align-text-top noRightClick twitterSection" data="">

ఇదీ చదవండి:ఊబకాయులా? గుండె జబ్బు ముప్పు తగ్గించుకోండి ఇలా!

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.