- ఒక టేబుల్ స్పూన్ కాఫీ పౌడర్‌లో చెంచా పాలు కలిపి ముఖానికి పూతలా వేయండి. ఇలా వారానికి రెండు సార్లు చేస్తే ముఖంపై ఉన్న మచ్చలు మాయమవుతాయి. ముఖంపై గీతలూ, ముడతలూ తగ్గుతాయి. స్ట్రెచ్‌మార్క్స్ ఉన్న చోటా దీన్ని ప్రయత్నించొచ్చు.
- కాఫీ పౌడర్‌లో కొద్దిగా పంచదార, నిమ్మరసం, తేనె, చెంచా ఆలివ్‌నూనె కలిపి పేస్ట్‌లా చేయాలి. ఈ మిశ్రమాన్ని ముఖం, మెడ, చేతులు వంటి ప్రదేశాల్లో రాసి మృదువుగా రుద్దితే మృతకణాలు తొలగి నునుపుగా మారుతుంది.
- టాన్ ప్రభావం ఎక్కువగా ఉంది అనుకున్నప్పుడు రెండు చెంచా కాఫీ పౌడర్‌లో కొద్దిగా పెరుగు, చెంచా తేనె కలిపి ముఖానికి రాసుకోండి. చర్మం కాంతిమంతంగా కనిపిస్తుంది. చర్మాన్ని ఆరోగ్యంగా, తాజాగా కనిపించేలా చేస్తుంది.
- రెండు చెంచాల కాఫీ పౌడర్‌లో రెండు చెంచాల ఆలివ్‌నూనె, నానబెట్టి రుబ్బిన బాదం గింజల మిశ్రమం, కాసిన్ని పాలు, రెండు చెంచాల శనగపిండి కలిపి ఒంటికి నలుగులా రుద్దుకోవచ్ఛు ఈ స్క్రబ్ చర్మానికి నిగారింపు తెస్తుంది.
ఇదీ చూడండి: సుదీర్ఘంగా భారత్-చైనా సైనికాధికారుల చర్చలు