ETV Bharat / sukhibhava

ఇలా కూర్చుంటే కండరాలపై ఒత్తిడి పడదు! - మెడనొప్పి రాకుండా కూర్చునే విధానం

రోజువారి జీవితంలో మనం చేసే పనుల వల్ల మెడ, నడుంనొప్పి వస్తుంటాయి. అయితే కూర్చునే, నిలబడే, నడిచే విధానంలో పలు మార్పులు చేసుకుంటే ఆ సమస్యల నుంచి బయటపడొచ్చని వైద్యనిపుణులు సూచిస్తున్నారు.

Sitting positions for good posture
ఇలా కూర్చుంటే కండరాలపై ఒత్తిడి పడదు!
author img

By

Published : Aug 22, 2021, 7:15 AM IST

ఇందిర నిత్యం వ్యాయామాలు చేస్తుంది. ఆరోగ్యకర ఆహారం తీసుకుంటుంది. ఆఫీస్‌ నుంచి సాయంత్రం ఇంటికొచ్చేసరికి మెడ, నడుం నొప్పితో బాధపడుతుంది. కారణం తెలియడంలేదామెకు. నియమాలెన్ని పాటించినా, కూర్చునే విధానం, నడిచే తీరు కూడా అవయవాలపై ఒత్తిడిని కలిగిస్తాయంటున్నారు వైద్యనిపుణులు. ఈ కారణంగానే పలురకాల సమస్యలకు గురవుతారని.. ఇందుకు కొన్ని పొరపాట్లు చేయకూడదంటున్నారు. అవేంటంటే?

నిలబడేటప్పుడు..

శరీరం నిటారుగా ఉండాలి. చెవులు కిందగా భుజాలుండేలా చూసుకోవాలి. అలాగే భుజాలు హిప్స్‌కు తిన్నగా ఉండేలా జాగ్రత్తపడాలి. దీంతోపాటు హిప్‌ మోకాలు, పాదం వెనుక భాగంపైకి వచ్చేలా ఉంటే శరీరంలోని కండరాలపై ఎటువంటి ఒత్తిడి పడదు. అలాకాకుండా వంకరగా నుంచోవడం, ఎక్కువసేపు ఒకే కాలిపై శరీరం బరువునంతా ఉంచడం వల్ల అక్కడి కండరాలు బలహీనపడతాయి. భుజాలు ముందుకు వంగినట్లుగా కాకుండా తిన్నగా నిల్చోవడం అలవరుచుకోవాలి.

చేతిలో ఫోన్‌తో

ఎక్కడైనా నుంచొని చేతిలో ఫోన్‌ను చూస్తూ ఎక్కువసేపు ఉండటం వల్ల చాలారకాల ఆరోగ్య సమస్యలు వచ్చే అవకాశం ఉంది. తలను వంచి అధికసమయం ఉంటే తల బరువు ప్రభావం మెడ జాయింట్స్‌, లిగ్మెంట్స్‌పై పడి, అక్కడ ఒత్తిడి పెరుగుతుంది. దీంతో మెడ కండరాల పని తీరు తగ్గి, తీవ్ర అనారోగ్యానికి గురవుతాయి. ఈ తరహా పొరపాట్లు చేయకుండా ఉంటే ఈ సమస్యకు దూరంగా ఉండొచ్చు.

కూర్చునేటప్పుడు

ఆఫీస్‌లో గంటలతరబడి ఒకేచోట కూర్చుని పనిచేసేటప్పుడు తగిన జాగ్రత్తలు తీసుకోకపోతే మెడ, భుజాలు, చేతులు, నడుంవద్ద కండరాలపై ప్రభావం చూపుతుంది. కంటికి తిన్నగా కంప్యూటర్‌ ఉండేలా ఏర్పాటు చేసుకోవాలి. కీబోర్డు మోచేతులకు సమాన ఎత్తులో ఉండటం తప్పనిసరి. ముందుకు వంగి కూర్చోవడం, కంటికి దగ్గరగా కంప్యూటర్‌ స్క్రీన్‌ ఉండటం మంచిది కాదు. సౌకర్యంగా కూర్చుంటూ, మధ్యమధ్యలో విరామం తీసుకుంటే కండరాల సమస్యలకు దూరంగా ఉండొచ్చు.

ఇదీ చదవండి: ఇవి తినండి.. ఏకాగ్రతను పెంచుకోండి!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.