లక్షణాలు:
ముఖమంతా నొప్పి ఉంటుంది. మరీ ముఖ్యంగా కనుబొమలపై ఎక్కువగా అనిపిస్తుంది. ముక్కు మూసుకుపోవడం, దగ్గు, జ్వరం, నోటి దుర్వాసనా, అలసట, తలనొప్పి వంటివి దీని ప్రధాన లక్షణాలు. తరచూ దీనిబారిన పడేవారు ఆహారంలో వెల్లుల్లి, అల్లం, మిరియాలు చేర్చుకోవాలి. ఇవి కఫాన్ని తగ్గిస్తాయి. నిత్యం పచ్చి ఉల్లిపాయలు తినడం మంచిది. గోరువెచ్చని నీళ్లను మాత్రమే తాగాలి. రోజూ ముఖానికి ఆవిరి పట్టాలి.
ఇంటి వైద్యం:
- గోరువెచ్చని ఆవనూనెను రోజూ మూడు చుక్కలు ముక్కులో వేసుకోవాలి. తరువాత ముఖాన్ని మర్దనా చేసుకుంటే ఉపశమనం కలుగుతుంది.
- అయిదు గ్రాముల వసకొమ్ము చూర్ణం, 20 మి.లీ నువ్వుల నూనె, 30 మి.లీ నీటిని కలిపి నూనె మాత్రమే మిగిలేలా సన్నటి మంటపై మరగనివ్వాలి. ఈ నూనెను రెండు చుక్కల చొప్పున ముక్కులో వేసుకుంటుంటే సమస్య తగ్గుముఖం పడుతుంది.