హార్మోన్లు సక్రమంగా పనిచేస్తేనే.. శరీరంలోని ప్రతి అణువుకూ ఆరోగ్యం అందుతుంది. అవయవాలు వాటి పని అవి చేసుకోవాలంటే ప్రొజెస్టరాన్, ఈస్ట్రోజన్ల వంటి హార్మోన్లు సమతుల్యంగా ఉండాలి. ఎప్పుడు పడితే అప్పుడు ఆహారం తీసుకుంటూ, ఏది పడితే అది తినేస్తే శరీరానికి వాటిని అరిగించడానికే సమయం సరిపోతుంది. మరి హార్మోన్లు సక్రమంగా ఉండాలంటే ఎలా ఉంటాయి. అందుకే, మనం ఈ చిట్కాలు పాటిస్తే మన శరీరాన్ని మన అదుపులో ఉంచే హార్మోన్లు పద్ధతిగా విడుదలవుతాయి.
ఒత్తిడి చాలామటుకు మనలోని హార్మోన్లని ప్రభావితం చేస్తుంది. అందుకే దాన్ని తగ్గించుకునేందుకు రోజూ కప్పు గ్రీన్‌టీ తాగండి. ఒత్తిడి తగ్గి హార్మోన్ల తీరు బాగుంటుంది.
ఒమెగా 3, ఒమెగా 6 ఫ్యాటీ ఆమ్లాలు హార్మోన్ల సమతుల్యత కోల్పోకుండా చేస్తాయి. ఇవి అందాలంటే వేరుసెనగ నూనె, సన్‌ఫ్లవర్ నూనెలని ఆహారంలో చేర్చుకోవాలి.
సోయా పాలు తాగడం, ఆ గింజలు ఎక్కువగా తీసుకునేవారిలో హార్మోన్ల పనితీరు బాగుంటుంది. పైగా వాటివల్ల మెనోపాజ్ దశలో ఎదురయ్యే సమస్యలు అదుపులో ఉంటాయని అధ్యయనాలు చెబుతున్నాయి. కాబట్టి వాటిని ఎక్కువగా తీసుకోవడం మంచిది.
ఇదీ చదవండి: బ్లాక్‌హెడ్స్ కు గుడ్ బాయ్ చెప్పేద్దామిలా!