ETV Bharat / sukhibhava

పిల్లలు స్కూల్​ నుంచి వచ్చాక పేరెంట్స్​ అడగాల్సిన ప్రశ్నలివే! ఎందుకో తెలుసా? - Questions to Children After Coming from School

Parenting Tips in Telugu: మీ పిల్లలు స్కూల్​కు వెళ్తున్నారా..? మరి స్కూల్​ నుంచి ఇంటికి వచ్చాక వారిని ఈ ప్రశ్నలు అడుగుతున్నారా..? ఇలా ప్రశ్నలు అడగడం వల్ల పేరెంట్స్​ అండ్​ పిల్లల మధ్య కమ్యూనికేషన్​ డెవలప్​ అవుతుందని.. మానసిక నిపుణులు అంటున్నారు. మరి ఆ ప్రశ్నలు ఏంటో ఈ స్టోరీలో చూద్దాం..

Parenting Tips in Telugu
Parenting Tips in Telugu
author img

By ETV Bharat Telugu Team

Published : Dec 5, 2023, 3:06 PM IST

Parents Must Ask these Questions to Children After they Coming from School: పిల్లలకు అత్యంత విలువైన కానుక పేరెంట్స్​ నుంచి ఉందంటే అది సమయం మాత్రమే. అయితే ఉద్యోగ ఒత్తిళ్లు, స్మార్ట్​ఫోన్ల వినియోగం, భార్యాభర్తలిద్దరికీ కనీసం మాట్లాడుకునే సమయం లేకపోవడం వంటివన్నీ పిల్లలపై తీవ్ర ప్రభావాన్ని చూపిస్తున్నాయి. దీంతో పిల్లలకు, తల్లిదండ్రుల మధ్య కమ్యూనికేషన్ ఉండటం లేదు. దీనివల్ల పిల్లలు ఎదుర్కొనే సమస్యల(అది ఇంట్లో లేదా బయట) గురించి పేరెంట్స్​కు తెలియడం లేదు. కాబట్టి.. మీరు వారితో కాస్త సమయం గడిపితే ఏ సమస్య వచ్చినా ముందుగా మీతోనే చెప్పుకుంటారు.

పేరెంట్స్​కి, పిల్లలకి ఒకరి పట్ల ఒకరికి అండర్ స్టాండింగ్, నమ్మకం, స్నేహం ఉంటే ఇక పిల్లలు ఏ విషయాలకు కూడా భయపడరు. తల్లిదండ్రులు పిల్లలకు ఒక సపోర్ట్ సిస్టమ్​గా డెవలప్ అవుతారు. దానివల్ల వాళ్లు తప్పుదారి పట్టకుండా కాపాడుకోవచ్చు. కొంచెం ఓపిక, కొంచెం సానుభూతి, సరైన ప్రయత్నం ఉంటే మీ పిల్లలతో అనుబంధాన్ని పెంచుకోవచ్చు. ఎన్ని పనులున్నా, ఎంత బిజీగా ఉన్నా ప్రతిరోజూ కొంత సమయాన్ని పిల్లల కోసం కేటాయించండి. కాగా, పిల్లలకు స్కూలింగ్​ చాలా ఇంపార్టెంట్​. ఎందుకంటే ఏదైనా నేర్చుకునేది స్కూల్​ నుంచే.. అది మంచైనా లేదా చెడైనా. కాబట్టి స్కూల్​ నుంచి తిరిగొచ్చాక పిల్లల్ని తల్లిదండ్రులు అడగాల్సిన ప్రశ్నలివే.!

మీ పిల్లలు ఫోన్ వదలట్లేదా? - ప్రాణాంతకం కావొచ్చు - ఇలా వదిలించండి!

స్కూల్​ నుంచి తిరిగొచ్చాక పిల్లలను అడగాల్సిన ప్రశ్నలివే..

  • స్కూల్​ సమయంలో ఆడుకోవడానికి సమయం ఇచ్చారా లేదా అడగాలి. ఆటలంటే పిల్లలకు చాలా ఇష్టం. దీంతో ఉత్సాహంగా సమాధానం చెబుతారు.
  • స్కూల్లో జరిగిన ఫన్నీ సంఘటన గురించి అడగాలి. పిల్లలు వాటిని కథలు కథలుగా చెబుతారు.
  • పిల్లలు స్కూల్లో ఏ పని చేయడానికి ఎక్కువ ఇష్టపడుతున్నారో తెలుసుకోవాలి. దీని వల్ల పిల్లల అభిరుచి, ఆసక్తి తెలుస్తోంది. దీంతో ఆ విషయంలో మీ ప్రోత్సాహం అందిచొచ్చు.
  • పాఠశాలలో కష్టంగా చేసిన పనేంటి అని అడగాలి. ఇలా అడిగితే పిల్లలు ఏ విషయంలో ఇబ్బందులు పడుతున్నారో తెలుస్తుంది. అందువల్ల వాటిని పరిష్కరించడానికి అవకాశం ఉంటుంది.

మీ పిల్లలు క్లాస్ ఫస్ట్ తెచ్చుకుంటే చూడాలనుందా? - తల్లిదండ్రులుగా మీరు ఇవి చేయాలి!

  • పిల్లలు ఏ యాక్టివిటీస్​ పట్ల ఉత్సాహంగా ఉన్నారో తెలుసుకోవాలి. అవి వారి భవిష్యత్తును నిర్దేశించవచ్చు.
  • ఏ విషయం గురించైనా స్కూల్లో మెచ్చుకున్నరా అని అడగాలి. పిల్లల్లో సెల్ఫ్​ రెస్పెక్ట్​, ఆత్మవిశ్వాసం పెంపొందే అవకాశం ఉంటుంది.
  • స్కూల్లో ఏదైనా మంచి పని చేశావా అని అడగాలి. తద్వారా పిల్లలు మంచి నడవడిక వైపు వెళతారు.
  • ఈరోజు లంచ్​ నచ్చిందా అని అడగాలి. అదే కాకుండా ఇంకా ఏమైనా తిన్నారా అని అడగాలి. తద్వారా పిల్లలకు ఇష్టమైన ఆహారం గురించి ఈజీగా తెలిసిపోతుంది. అలాగే వారు ఏమి తిన్నారో కూడా తెలుసుకోవచ్చు.
  • స్కూల్లో కొత్తగా ఫ్రెండ్స్​ అయ్యారా అని అడగాలి. అందువల్ల వాళ్ల ఫ్రెండ్స్​ పేర్లు, వాళ్లతో జరిగిన విషయాలు కచ్చితంగా చెబుతారు.

How to Build Self Confidence in Children : మీ పిల్లలు ఆత్మవిశ్వాసం కోల్పోయారా? ప్రధాన కారణం మీరేనట.. ఈ టిప్స్​ ఫాలో అవ్వండి!

హలో పేరెంట్స్​.. మీ అబ్బాయికి ఈ విషయాలు చెప్తున్నారా?

మీ పిల్లలు సరిగా చదవట్లేదా? కారణాలు ఇవేనట - సెట్ చేయాల్సింది మీరే!

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.