ETV Bharat / sukhibhava

లోదుస్తులపై మరకలా? అనారోగ్యం కావచ్చు!

మహిళలందరూ లో దుస్తులపై మరకలను గమనించినా కొందరు వాటిని నిర్లక్ష్యం చేస్తారు. లేదా వాటి గురించి ఇతరులతో మాట్లాడటానికి జంకుతారు. రుతుస్రావం కాక ఇతరత్రా ఉన్న యోని స్రావాలు గర్భాశ్రయ అనారోగ్యాన్ని సూచించవచ్చు. ఎటువంటి దుర్వాసన ఉన్నా, ఇతరత్రా అసాధారణ మార్పులున్నా వైద్యులను సంప్రదించాలి. వంధ్యత్వ నిపుణురాలు, మహిళా ఆరోగ్య వైద్యులు డా. పూర్వ సహకారి ఈ విషయాల గురించి వివరించారు.

author img

By

Published : Mar 9, 2021, 4:54 PM IST

Panty stains
లోదుస్తులపై మరకలు అనారోగ్యాన్ని సూచిస్తాయా

పెదవులపై దొండపండు రంగు ఎంత ఆరోగ్యాన్ని సూచిస్తుందో లోదుస్తులపై అటువంటి వర్ణాలు మహిళల పునరుత్పత్తి వ్యవస్థ ఆరోగ్యస్థితిని ప్రతిఫలిస్తాయి. మహిళల పునరుత్పత్తి వ్యవస్థలో గర్భాశయం, అండవాహికలు, యోని ప్రధాన భాగాలు. గర్భాశయ ముఖద్వారం (సర్విక్స్), యోనిపై ప్రభావం చూపే అవ్యవస్థ లేదా రోగకారక పరిస్థితి అకాల యోని స్రావాలకు కారణం కావచ్చు.

ముట్టుబట్టలపై కనిపించే మరకలు యోని స్రావమే. అయితే ఇది సాధారణమా, అసాధారణమా అని ఎలా తెలుస్తుంది?

  • మహిళల్లో ఎటువంటి దుర్వాసన లేని పారదర్శక స్రావం సహజంగా కలగవచ్చు. ఇది జబ్బు కాదు. ఈ స్రావం గర్భాశయ ముఖద్వారం నుంచి, యోని గోడల నుంచి కలుగుతుంది. రుతుస్రావంలో ఒక నెలలో కలిగే ఉత్తేజకాల (హార్మోన్స్) హెచ్చు తగ్గుల వల్ల ఇలా జరుగుతుంది. యోనిలో ఉండే లాక్టోబాసిల్లస్ అనే మంచి బ్యాక్టీరియా కారణంగా పి.హెచ్. విలువ(అమ్లత) 4గా ఉండటం వల్ల ఇన్ఫెక్షన్లు రావు. ఈ స్రావాలు ఒక్కో మహిళలో ఒక్కో విధంగా ఉండవచ్చు. మీలో సహజంగా కలిగే స్రావాన్ని గుర్తుంచుకుంటే అసాధారణ స్రావాన్ని గుర్తుపట్టవచ్చు.
  • గర్భధారణ సమయంలో యోని స్రావాలు కొద్దిగా అధికంగా ఉంటాయి.
  • నెల మధ్యలో అండాశయం నుంచి అండం విడుదలయ్యే సమయంలో యోని స్రావం కొద్దిగా జిగటగా, మందంగా, ఎక్కువ ప్రమాణంలో కలుగుతుంది.
  • అసాధారణంగా కనిపించే స్రావం జననేంద్రియ ఇన్ఫెక్షన్ వల్ల కానీ, ఘర్షణ వల్ల కానీ కలగవచ్చు.
  • దురదతో కూడిన తెల్లటి, చిక్కటి, పెరుగులాంటి యోని స్రావం శిలీంధ్రాల (ఫంగస్) వల్ల కలుగుతుంది.
  • కొద్దిగా బూడిద రంగు ఉండి, చేపల వంటి వాసన గల యోని స్రావం బ్యాక్టీరియా కలిగించే యోని శోథకు గుర్తు.
  • కొద్దిగా పసుపు రంగులో నురుగులా ఉండి చేపల లాంటి వాసన గల యోని స్రావం ట్రైకోమోనియాసిస్ లాంటి సుఖ వ్యాధులను సూచిస్తుంది.
  • మూత్రమార్గంలో అవరోధం తొలగించటానికి వైద్యులు ఏర్పాటుచేసిన శస్త్ర పరికరం కానీ, రుతుస్రావాన్ని పీల్చుకునే చుట్టలు కానీ మరేదైనా ఇతర వస్తువు చేసిన గాయం వల్ల చీముతో కూడిన యోని స్రావం దుర్వాసన కలిగి ఉంటుంది.

రెండు రుతుస్రావాల మధ్య లేదా సంభోగం తరువాత కనిపించే రంగుల మరకలు గర్భాశయ ముఖద్వార అస్వస్థతను సూచించవచ్చు.

ముట్లుడిగిన తరువాత ఆర్తవ (మెన్సెస్) స్రావం కానీ, రక్తపు మరకలు కానీ కనిపిస్తే వైద్య పరీక్షలు చేయించాలి. గర్భాశయ క్యాన్సర్​కు కూడా అది సంకేతం కావచ్చు.

వైద్యులను ఎప్పుడు సంప్రదించాలి:

ఈ కింది లక్షణాలు కలిగినపుడు వైద్యులను సంప్రదించాలి:

  • పసుపు, పచ్చ రంగులో స్రావం ఉన్నపుడు
  • చిక్కటి తెలుపు స్రావం ఉన్నపుడు
  • జననేంద్రియాలలో దురద, ఎరుపు రంగు లేదా కమిలి ఉన్నపుడు
  • పొత్తి కడుపులో నొప్పి
  • అసాధారణ స్రావం పదేపదే అయినపుడు
  • సంభోగం తరువాత రక్తస్రావం లేదా మరకలు
  • ముట్లుడిగిన తరువాత రక్తస్రావం

యోని శోథ తగ్గించడానికి:

  • జననేంద్రియ పరిశభ్రతకు చేసే పరిషేకం (వజైనల్ డూష్) చేయరాదు
  • సువాసన గల సిద్ధ మైల వస్త్రం (సానిటరీ ప్యాడ్స్) వాడరాదు. అవి యోని పి.హెచ్. విలువను పెంచుతాయి.
  • సువాసన గల సబ్బులు, అనవసర రసాయనాలు జననేంద్రియ పరిశుభ్రతకు వాడరాదు.
  • మరుగుదొడ్డి వాడిన ప్రతిసారీ నీటితో శుభ్రం చేసుకోవాలి.
  • జననేంద్రియాలను ముందుగా శుభ్రం చేసుకోవాలి. అంటే ముందు నుంచి వెనుకకు శుభ్రం చేయాలి.
  • ఫంగల్ ఇన్ఫెక్షన్ తగ్గించటానికి కాటన్ లోదుస్తులను వాడాలి.
  • సురక్షిత శృంగారం కోసం కండోమ్స్ వాడాలి.
  • జననేంద్రియాల పరిశుభ్రత తరువాత చేతులను శుభ్రంగా కడుక్కోవాలి.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.