Onion Juice Benefits For Sugar Patients : శారీరక శ్రమ లేకపోవడం, లైఫ్‌స్టైల్ మార్పులు, పని ఒత్తిడి, మారిన ఆహార అలవాట్లు ఇతర కారణాల వల్ల ప్రస్తుతం ప్రపంచ వ్యాప్తంగా డయాబెటిస్‌తో బాధపడేవారి సంఖ్య క్రమక్రమంగా పెరుగుతోంది. ఒక్కసారి షుగర్ వ్యాధి వస్తే, దాన్ని కంట్రోల్ చేసుకోవడం తప్ప.. పూర్తిగా తగ్గించుకోలేము. రక్తంలో చక్కెర స్థాయిలు కంట్రోల్‌లో లేకపోతే తీవ్ర ఆనారోగ్య సమస్యలు వచ్చే ప్రమాదం ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. అయితే షుగర్ ఉన్న వారికి ఉల్లిపాయ దివ్య ఔషధంగా పని చేస్తుందని నిపుణులంటున్నారు. అది ఎలానో ఇప్పుడు తెలుసుకుందాం.
Onion Juice Blood Sugar Levels : రక్తంలో చక్కెర స్థాయిలు నియంత్రణలో : షుగర్ ఉన్న వారు ఉల్లిపాయ రసం తాగడం వల్ల రక్తంలో చక్కెర స్థాయిలు నియంత్రణలో ఉంటాయని చాలా పరిశోధనల వెల్లడించాయి. ఇటీవల విడుదల చేసిన బ్రిటిష్ వెబ్‌సైట్ ఎక్స్‌ప్రెస్ నివేదిక ప్రకారం, షుగర్ పేషెంట్స్ ఉల్లిపాయ రసం తాగడం వల్ల వారి రక్తంలో చక్కెర స్థాయిలు 50 శాతం వరకు తగ్గాయని పరిశోధకులు వెల్లడించారు. అమెరికాలో సైన్స్ పై జరిగిన ఒక వార్షిక సదస్సులో ఈ పరిశోధనను వారు సమర్పించారు.
తలనొప్పి తగ్గడం లేదా? ఈ టీ లు ట్రై చేస్తే చిటికెలో మాయం!
మన దేశంలో కూడా దీనికి సంబంధించి పరిశోధనలు జరిగాయి. సోలాపూర్‌లోని శ్రీ రామచంద్ర మహా విద్యాలయలోని శాస్త్రవేత్తలు కొందరు దీనిపై పరిశోధనలు చేశారు. ఈ పరిశోధనలో వారు టైప్ 2 డయాబెటిస్ ఉన్న 100 మంది రోగులను రెండు గ్రూపులుగా విభజించారు. ఒక బృందానికి రోజుకు ఒకసారి ఉల్లిపాయ రసం 20 మిల్లీలీటర్లు అందించారు. మరొక బృందానికి మాత్రం ఉల్లిపాయ రసం ఇవ్వలేదు. ఆరు నెలల తర్వాత ఉల్లిపాయ రసం తీసుకున్న షుగర్ పేషెంట్‌ల రక్తంలో గ్లూకోజ్ స్థాయిలు గణనీయంగా తగ్గాయని గుర్తించారు. అలాగే కొలెస్ట్రాల్, ట్రైగ్లిజరైడ్ స్థాయిలు కూడా తగ్గాయని వారు తెలిపారు.
ఎలా తయారు చేసుకోవాలి:
- ఉల్లిపాయ వాటర్‌ను తయారు చేయడానికి.. రెండు ఉల్లిపాయలు, 1 కప్పు నీళ్లు, 1 స్పూన్ నిమ్మరసం, 1 చిటికెడు రాక్ సాల్ట్ తీసుకోండి.
- ఇవన్నీ బ్లెండర్‌లో వేసి.. గ్రైండ్ చేయండి. ఆ తర్వాత డింక్‌ను ఎంజాయ్ చేయవచ్చు.
- ఈ డ్రింక్‌ను ఫిల్టర్ చేయవద్దు. దానిలోని ఫైబర్ కూడా మన ఆరోగ్యానికి మేలు చేస్తుంది.
- ఉల్లిపాయ ఘాటును తగ్గించడానికి, ఉప్పు హెల్ప్ చేస్తుంది. మీకు వద్దనుకుంటే.. ఉప్పు స్కిప్ చేసి కొద్దిగా తేనె యాడ్ చేయండి.
- ఈ డ్రింక్ షుగర్‌ను కంట్రోల్ చేయడంతోపాటు, ఇమ్యూనిటీని పెంచుతుంది.
గమనిక: పలు అధ్యయనాల ప్రకారం ఈ వివరాలను అందించాం. ఈ కథనం కేవలం మీ అవగాహన కోసమే. ఆరోగ్యానికి సంబంధించిన ఏ సమస్య ఉన్నా వైద్యులను సంప్రదించడమే ఉత్తమ మార్గం.
మీ జీవితకాలం మరో పదేళ్లు పెరగాలా? - అయితే ఈ ఆహార పదార్థాలు తినండి!