ETV Bharat / sukhibhava

ఈజీగా బరువు తగ్గాలా?.. ఉదయం ఇలా చేస్తే ఇట్టే నాజూకుగా అయిపోతారు! - బరువు తగ్గడానికి చేయాల్సిన వ్యాయామం

శరీరాన్ని సరైన ఆకృతిలో పెట్టుకోవడానికి ఎన్నో మార్గాలను అనుసరిస్తూ ఉంటాం. డైట్ పాటిస్తూ వ్యాయామాలు, మార్నింగ్ వాకింగ్ చేస్తుంటారు. అలాగే శరీర బరువును తగ్గించడంలో ఉదయం మనం తీసుకునే జాగ్రత్తలు బాగా ఉపయోగపడతాయి. అధిక బరువు తగ్గేందుకు పాటించాల్సిన చిట్కాలేంటో ఓ సారి తెలుసుకుందాం.

Morning Habits To Help You Lose Weight
కొన్ని ఉదయపు అలవాట్లతో బరువు తగ్గవచ్చు
author img

By

Published : Feb 6, 2023, 7:38 AM IST

బరువు తగ్గడానికి పాటించాల్సిన ఉదయపు అలవాట్లు

ఉదయం లేవగానే మనసు చాలా ఉల్లాసంగా ఉత్సాహంగా ఉంటుంది. ఉదయపు వాతావరణంలో ఎంతో జీవం ఉంటుందని నిపుణులు చెబుతారు. అయితే ఇది రోజు వాకింగ్ జాగింగ్ చేసేవారికి అనుభవం. అధిక బరువుతో బాధపడేవారు మాత్రం వాకింగ్ చేయడానికి కాస్త బద్దకించవచ్చు. మరి బరువు తగ్గాలంటే కచ్చితంగా వ్యాయామం చేయాల్సిందే. ఉదయం లేవగానే బరువు చెక్​ చేసుకోవాలి. దాని బట్టి రోజులో ఎలాంటి ఆహారం తీసుకోవాలి, ఎంత పరిమాణంలో తీసుకోవాలి, ఎలాంటి వ్యాయామాలు చేయాలి అనే వాటిని నిర్ణయించుకోవచ్చు.

Morning Habits To Help You Lose Weight
బరువు తగ్గడానికి వ్యాయామం

అల్పాహారం
ఉదయం లేచి బ్రష్ చేశాక కచ్చితంగా గ్లాస్ లేదా రెండు గ్లాస్​ల నీరు తాగాలి. నీటిలో ఎలాంటి కేలరీలు ఉండవు కాబట్టి శరీరానికి ఎలాంటి కేలరీలు అందవు. పైగా కడుపునిండిన భావన కలుగుతుంది. దీంతో కాస్త ఆకలి తగ్గుతుంది. ఫలితంగా ఉదయం ఎక్కువ అల్పాహారం తినాలని ఉండదు. టిఫిన్​ ద్వారా శరీరానికి ఎక్కువ క్యాలరీలు అందే అవకాశం ఉండదు. అంతేకాకుండా నీరు ఎక్కువగా తాగడం వల్ల శరీరంలో మెటబాలిజం జరుగుతుంది. దీంతో పాటు నిద్ర కూడా చాలా అవసరమని నిపుణులు చెబుతున్నారు.

Morning Habits To Help You Lose Weight
బరువు తగ్గడానికి ఎక్కువ ప్రొటీన్ ఉన్న అల్పాహారం

"మనం మంచిగా నిద్రపోయామా లేదా అనేది చాలా ముఖ్యం. ప్రతిరోజు 8గంటల నిద్ర అనేది చాలా అవసరం. దానివల్ల హర్మోనల్ బ్యాలెన్స్ అవుతుంది. ఎక్కువగా నిద్రపోయేవారే తొందరగా బరువు తగ్గడంలో విజయవంతం అవుతున్నారు. ఉదయం టిఫిన్​లో అధిక ప్రొటీన్ ఉండే పాలు, గుడ్లు, కూరగాయలు ఉండేలా చూసుకోవాలి. వ్యాయామం కూడా తప్పనిసరిగా చేయాలి. యోగా, మెడిటేషన్​ చేయాలి. దీని వల్ల బ్రెయిన్ పనితీరు మెరుగుపడుతుంది. దానివల్ల ఎక్కువ ఫ్యాట్, కార్బోహైడ్రేట్స్ లేని ఫుడ్​ను మనం తీసుకోగలుగుతాం. చాలా మంది తరచుగా బయట తింటుంటారు. అలా కాకుండా ఇంట్లో వండిన ఆహారాన్నే తీసుకోవాలి. అలాగే ఉదయాన్నే సగం లీటరు నీరు తీసుకుంటే ముప్పై శాతం వరకు బరువు తగ్గే అవకాశాలున్నాయి. ప్రతిరోజు 8వేల స్టెప్స్ అనేది చాలా ముఖ్యం. ప్రతిరోజూ యాక్టివిటీ ఉంటే కేలరీలు ఎక్కువగా బర్న్ అయ్యి బరువు తగ్గే అవకాశాలుంటాయి. తగిన మోతాదులో కేలరీలు తీసుకోవడం అనేది చాలా ముఖ్యం. ఎక్కువ కేలరీలను ఉదయం పూట తీసుకోవచ్చు."
-డా.వుక్కల రాజేశ్, జనరల్ ఫిజీషియన్

ప్రణాళిక అవసరం
రోజు ఉదయం బరువు చూసుకున్న తర్వాతే ఆ రోజంతా తీసుకోవాల్సిన ఆహారం గురించి ప్రణాళిక సిద్ధం చేసుకోవాలి. ఈ విధంగా క్రమబద్దమైన ప్రణాళికను ఆచరణలో పెడితే అనవసరంగా బరువు పెరగకుండా ఉండొచ్చు. మనం ఆహారం తీసుకుంటున్నప్పుడు దాని రుచి, వాసనను ఆస్వాదించాలి. ఆ తర్వాతే ఆహారాన్ని తినాలి. ఇలా చేయటం ద్వారా మంచి భావన కలుగుతుంది.

Morning Habits To Help You Lose Weight
బరువు తగ్గడానికి వ్యాయామం

తినేటప్పుడు ఫోన్, టీవీ చూడటం లాంటివి చేయొద్దు. రోజూ ఇలా ప్రాక్టీస్ చేయడం ద్వారా సులభంగా బరువు తగ్గవచ్చు. ఉదయం టిఫిన్ తినేకంటె ముందే కాలి కడుపుతో వ్యాయామాలు చేయాలి. దీని వల్ల అధికంగా ఉన్న కొవ్వు కరిగిపోతుంది. ఆ తర్వాత అల్పాహారంలో పిండి పదార్థాలు ఎక్కువగా తీసుకోకుండా మాంసకృతులు ఎక్కువగా ఉండేలా చూసుకోవాలి. ఎక్కువ ప్రొటీన్ ఉన్న అల్పాహారం తీసుకోవడం వల్ల త్వరగా కడుపునిండిన భావన కలుగుతుంది. తక్కువగా ఫుడ్​ను తీసుకుంటాం.

Morning Habits To Help You Lose Weight
బరువు తగ్గడానికి అధికంగా నీరు తాగటం అవసరం

హోటళ్లలో తినవద్దు
ఉద్యోగ రీత్యా, వ్యాపార రీత్యా బయటకు వెళ్లేవారు బయట హోటళ్ల భోజనం కాకుండా ఇంటి నుంచే ఆహారం తీసుకెళ్లి తినాలి. బయట హాటళ్లలో దొరికే ఆహారంలో కేలరీలు ఎక్కువగా ఉంటాయి. బయట ఫుడ్ తింటే బరువు తగ్గక పోగా పెరుగుతుంటారు. మంచి ఆరోగ్యానికి సరైన నిద్ర అనేది చాలా అవసరం. రోజు 7గంటల నిద్ర అనేది చాలా అవసరం. లేకపోతే స్థూలకాయం వచ్చే అవకాశం ఉంది. పడుకునే సమయంలో ఫోన్లకు దూరంగా ఉంటే నిద్రలేమి సమస్య నుంచి బయటపడొచ్చు. తీసుకునే ఆహారం, వ్యాయామాల విషయంలో పక్కాగా ప్రణాళిక వేసుకుని పాటిస్తే అధిక బరువుకు సులభంగా చెక్​ పెట్టవచ్చు. మంచి ఆరోగ్యాన్ని సొంతం చేసుకోవచ్చు. దీంతో పాటు రోజు ఉదయం, సాయంత్రం మెడిటేషన్​ లాంటివి చేస్తే ఇంకా మంచిది.

Morning Habits To Help You Lose Weight
బయట ఆహారం తినవద్దు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.